Presidential Polls: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే షాకిచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల పాత్రపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరుకావడం లేదు. జూన్ 15న దిల్లీలో ఈ సమావేశం జరగనుండంగా, అదే సమయంలో ఠాక్రే అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
దీదీ వ్యూహం
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ నెల 15న దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని భాజపాయేతర పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను (మొత్తం 22 మందిని) ఆమె ఆహ్వానించారు.
మమతా బెనర్జీ ఆహ్వానించిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణకు గొప్ప అవకాశమని మమత తన లేఖలో పేర్కొన్నారు.
Also Read: Sonia Gandhi Hospitalized: ఆస్పత్రిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
Also Read: LAC Standoff: భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా కీలక వ్యాఖ్యలు