ABP  WhatsApp

Presidential Election 2022: మోదీ, అమిత్ షాతో ద్రౌపది ముర్ము భేటీ- ప్రధాని ఆసక్తికర ట్వీట్

ABP Desam Updated at: 23 Jun 2022 05:33 PM (IST)
Edited By: Murali Krishna

Presidential Election 2022: ఎన్‌డీఏ తరఫున రాష్ట్రపతి బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.

(Image Source: PTI)

NEXT PREV

Presidential Election 2022: నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్(ఎన్‌డీఏ) తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురువారం దిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెతో భేటీ తర్వాత ప్రధాని.. ముర్ము గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు.







రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉంది. దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉంది.                                                          -   ప్రధాని నరేంద్ర మోదీ


అమిత్‌ షాతో 






ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా ద్రౌపది ముర్ము కలిశారు. శాలువా, పుష్పగుచ్ఛంతో ఆమెను అమిత్‌ షా స్వాగతించారు. భాజపా సీనియర్‌ నాయకులతోనూ ఆమె భేటీ అవుతారని సమాచారం.


రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులను కలిసి ఆమె కోరనున్నారు. జూన్‌ 24న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.


Also Read: Uttar Pradesh News: పుసుక్కని అలా కాల్చేశావ్ ఏంటి భయ్యా! బరాత్‌లో ఫ్రెండ్ మృతి!


Also Read: Viral video: ఇదేం సెక్యూరిటీరా బాబు! ఇలా అయితే పిల్ల ఏనుగు కేంటి? PM కైనా ఏం కాదు!

Published at: 23 Jun 2022 05:31 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.