Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. క్షణానికో మలుపు తిరుగుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖలో ఎమ్మెల్యేలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత పార్టీ వ్యక్తి సీఎంగా ఉన్నా ఎమ్మెల్యేలుగా తమకు కలిసే అవకాశం కూడా వచ్చేది కాదని ఆరోపించారు. ఈ లేఖను ఏక్‌నాథ్ షిండే మీడియాతో షేర్ చేశారు.
పెరిగిన సంఖ్య
మరోవైపు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెబల్స్ క్యాంప్‌లో ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగింది. గురువారం ఉదయం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్ క్యాంప్‌లోకి జంప్ అయ్యారు.
బుధవారం రాత్రి నలుగురు ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు క్యాంప్‌లో చేరారు. దీంతో 24 గంటల వ్యవధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే చెంతన చేరారు. రెబల్స్ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య 46కుపెరిగింది. వీరిలో స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా గువాహటిలోని రాడీసన్ బ్లూ హోటల్లో బస చేస్తున్నారు. బలప్రదర్శన చేసేందుకు గవర్నర్ అవకాశం కోసం షిండే చూస్తున్నారు.
Also Read: Viral News: బిహార్‌లో షాకింగ్ ఘటన- బాలుడ్ని కాటేసి వెంటనే చనిపోయిన పాము!
Also Read: Maharashtra Political Crisis: పతనం అంచున ఠాక్రే సర్కార్- 24 గంటల్లో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్