ABP  WhatsApp

Viral video: ఇదేం సెక్యూరిటీరా బాబు! ఇలా అయితే పిల్ల ఏనుగు కేంటి? PM కైనా ఏం కాదు!

ABP Desam Updated at: 23 Jun 2022 03:42 PM (IST)
Edited By: Murali Krishna

Viral video: ఓ పిల్ల ఏనుగును చాలా జాగ్రత్తగా ఏనుగుల గుంపు తీసుకువెళ్తున్న ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇదేం సెక్యూరిటీరా బాబు! ఇలా అయితే పిల్ల ఏనుగు కేంటి? PM కైనా ఏం కాదు!

NEXT PREV

Viral video: సాధారణంగా వీవీఐపీలు, ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రెటీలకు Z+++ కేటగిరీ భద్రత కల్పిస్తారు. అయితే ఓ పిల్ల ఏనుగుకు ఇలాంటి భద్రత కల్పించడం ఎప్పుడైనా చూశారా? అవును ఈ భద్రత చూస్తే మీరు కూడా అవాక్కవ్వక తప్పదు.


కంటికి రెప్పలా


కోయంబత్తూర్‌లోని సత్యమంగళం ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై నడిచి వస్తుంది. అయితే ఆ ఏనుగుల కాళ్ల మధ్యలో ఓ పిల్ల ఏనుగు నడుస్తోంది. అది బయటకు వచ్చిన ప్రతిసారీ ఆ ఏనుగుల గుంపు అది కనిపించకుండా భద్రంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి.


ఈ ఆసక్తికర ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 







ఈ భూమ్మీద ఎవ‌రూ కూడా అంత భ‌ద్ర‌త క‌ల్పించ‌లేరు. అది కేవ‌లం ఏనుగుల గుంపునకే సాధ్య‌మైంది. అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగ‌తా ఏనుగులు జ‌డ్ ప్ల‌స్ ప్ల‌స్ ప్ల‌స్ కేటగిరి భ‌ద్ర‌త క‌ల్పించాయి.                                                        -  సుశాంత నంద, ఐఎఫ్ఎస్ ఆఫీసర్


వీడియో వైరల్


ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. పిల్ల ఏనుగును అంత భద్రంగా తీసుకువెళ్తున్న గజరాజులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ భద్రత ముందు ఏదైనా సరిపోదని కామెంట్లు పెడుతున్నారు. ఇది Z + + + కేటగిరీ భద్రతలా ఉందంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలను షేర్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు.


Also Read: Watch Video: అయోధ్యలో స్నానాల ఘాట్‌లో భార్యతో భర్త రొమాన్స్- చితక్కొట్టిన జనం, వీడియో వైరల్!


Also Read: Viral News: బిహార్‌లో షాకింగ్ ఘటన- బాలుడ్ని కాటేసి వెంటనే చనిపోయిన పాము!

Published at: 23 Jun 2022 03:38 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.