ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో ఓ జంటకు వింత అనుభవం ఎదురైంది. సరయూ నదిలో పుణ్యం స్నానం చేస్తుండగా తన భార్యతో భర్త సరసం ఆడాడు. భార్యకు ముద్దులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది చూసిన జనం ఆ వ్యక్తి చుట్టూ గుమిగూడారు.
చితక్కొట్టిన జనం
నదిలో స్నానం చేస్తున్న జనం ఆ భార్యాభర్తలను నిలదీశారు. భార్య వద్ద నుంచి భర్తను లాగేసి చితక్కొట్టారు. భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా అక్కడున్న వారు ఎవరూ వినలేదు. అయోధ్యలో ఇలాంటి అశ్లీలాన్ని సహించబోమన్నారు.
భార్య ముందు భర్తను కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. అసభ్య పదజాలంతో దూషించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పవిత్రమైన సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచారించాలి కానీ, ఇలాంటి పనులు చేయరాదని అక్కడున్న వాళ్లు వీడియోలో అన్నారు. ఇలాంటి పనులు చేస్తే ఇలానే చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వీడియో వైరల్ అవడంతో విషయం తెలుసుకున్న అయోధ్య పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read: Viral News: బిహార్‌లో షాకింగ్ ఘటన- బాలుడ్ని కాటేసి వెంటనే చనిపోయిన పాము!
Also Read: Maharashtra Political Crisis: పతనం అంచున ఠాక్రే సర్కార్- 24 గంటల్లో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్