Draupadi Murmu Unknown Facts: గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆమె నామినేషన్ వేసిన నాటి నుంచి ద్రౌపది ముర్ము గురించి చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే చాలా మందికి ఆమె వ్యక్తిగత విషయాలు, చేపట్టిన పదవులు వంటి విషయాలే తెలిశాయి.
కానీ మాహాభారతంలో బాగా ఫేమస్ అయిన 'ద్రౌపది' పేరును ఆమెకు ఎవరు పెట్టారు? అనే విషయం మాత్రం తెలియలేదు. అయితే తాజాగా ఆ ప్రశ్నకు కూడా జవాబు దొరికింది.
ఇలా తెలిసింది
'ద్రౌపది' పేరును స్కూల్ టీచర్ తనకు పెట్టినట్లు ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఒడియా వీడియో మ్యాగ్జిన్‌కు కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. సంతలి సంస్కృతి ప్రకారం తనకు పుతి అనే పేరు పెట్టారట. కానీ ఆ పేరును తన స్కూల్ టీచర్ ద్రౌపదిగా మార్చినట్లు ఆమె చెప్పారు. ద్రౌపది తన ఒరిజినల్ పేరు కాదు అని.. ఆ పేరును మరో జిల్లాకు చెందిన టీచర్ తనకు పెట్టినట్లు ముర్ము ప్రస్తావించారు.
రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన ద్రౌపది ముర్ము ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
రికార్డులు
- గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతి.
- దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టి, రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ (పుట్టిన తేదీ: 20/06/1958)
- రెండవ మహిళా రాష్ట్రపతి (ప్రతిభా పాటిల్ తర్వాత)
ద్రౌపది ముర్ము ప్రొఫైల్
- రాష్ట్రం – ఒడిశా
- గిరిజన వర్గానికి చెందిన మహిళ
- చదువు – BA (గ్రాడ్యుయేట్)
- రాజకీయం జీవితం ఇలా మొదలు - కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. తర్వాత 1997 రాయ్‌రంగ్‌పుర్ ఎన్‌ఏసీ వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
Also Read: Bus Accident In UP: ఘోర ప్రమాదం- ఒకదానికొకటి ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సులు, 8 మంది మృతి!
Also Read: Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 16,866 మందికి వైరస్