కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సూర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్ ఆఫర్‌ను ప్రశాంత్ కిశోర్ నిరాకరించినట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరాలని పీకేను సోనియా గాంధీ ఆహ్వానించారని అందుకు పీకే నో చెప్పినట్లు సుర్జేవాలా వెల్లడించారు.
పీకే ట్వీట్
ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన కంటే పార్టీకి నాయకత్వం అవసరమన్నారు.
కాంగ్రెస్ కోసం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని బతికించుకునేందుకు కొత్త వ్యూహకర్త కావాలని భావించి ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానించింది. ఆయన కూడా వెంటిలేటర్ మీద ఉన్న హస్తం పార్టీకి ప్రాణం నింపేందుకు ముందుకు వచ్చారు. అధినాయకత్వంతో నాలుగైదు సార్లు భేటీ అయ్యారు.
తన వ్యూహాలకు పదునుపెట్టి మిషన్ 400 అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదంతా గమనించిన హస్తం హైకమాండ్ పీకేను తమ నేతగా మార్చుకునేందుకు ప్రయత్నించింది.
కొంతకాలంగా జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. సోనియాగాంధీ, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆఫర్‌ను నిరాకరించినట్లు ట్వీట్ చేశారు.
Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు నో రిలీఫ్- బెయిల్ కోసం వెయిటింగ్ తప్పదు
Also Read: Covid Update: ఫోర్త్ వేవ్ దగ్గర పడిందా! ఒక్కరోజులో 1347 మంది కరోనాతో మృతి