Tej Pratap Yadav: ఆర్‌జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD)కి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో తన తండ్రిని కలుస్తానని, తన రాజీనామాను సమర్పిస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం హసన్‌పుర్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆరోపణలు
ఏప్రిల్ 22న జరిగిన ఇఫ్తార్ పార్టీలో తేజ్ ప్రతాప్ తనను ఓ గదిలోకి తీసుకువెళ్లి దాడి చేసినట్లు పార్టీ యువజన విభాగం పట్నా మహానగర అధ్యక్షుడు రామ్‌రాజ్ యాదవ్ ఆరోపించారు. పార్టీని వీడాలని, లేదంటే పది రోజుల్లోగా తనను కాల్చి చంపేస్తానని తేజ్ ప్రతాప్ బెదిరించినట్లు ఆయన తెలిపారు.
ఆ తర్వాత సోమవారం పార్టీ కార్యాలయానికి చేరుకుని యువజన కార్యకర్తలతో కలిసి రామ్‌రాజ్ యాదవ్ రాజీనామా సమర్పించారు. పార్టీ తనకు న్యాయం చేయలేదని, తనపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఆరోపణలను తేజ్ ప్రతాప్ ఖండించారు.
మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కుంభకోణం కేసులో ఇటీవలే ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. త్వరలోనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు లాలూ న్యాయవాది వెల్లడించారు.
Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు నో రిలీఫ్- బెయిల్ కోసం వెయిటింగ్ తప్పదు
Also Read: Covid Update: ఫోర్త్ వేవ్ దగ్గర పడిందా! ఒక్కరోజులో 1347 మంది కరోనాతో మృతి