Covid Update: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదుకాగా 1347 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,30,62,569కి పెరిగింది.
- యాక్టివ్ కేసులు: 15,636
- మొత్తం మరణాలు: 5,23,622
- మొత్తం కేసులు: 4,30,62,569
- రికవరీలు: 42,523,311
వ్యాక్సినేషన్
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. సోమవారం 22,83,224 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,95,76,423కు చేరింది.
కరోనా ఫోర్త్ వేవ్
కరోనా ఫోర్త్ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగదల కారణంగా కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. వైరస్ నిర్ధరణ పరీక్షలు పెంచడం, ట్రాక్ చేయడం, చికిత్స, వ్యాక్సినేషన్, కట్టడి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం- రష్యాకు ఓటమి తప్పదు: అమెరికా