ABP  WhatsApp

PM Modi Meeting: కరోనాపై అలసత్వం వద్దు, అలర్ట్‌గా ఉందాం- సీఎంలకు మోదీ సలహా

ABP Desam Updated at: 27 Apr 2022 05:15 PM (IST)
Edited By: Murali Krishna

PM Modi Meeting: కరోనా కేసులు పెరుగుతోన్న వేళ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

కరోనాపై అలసత్వం వద్దు, అలర్ట్‌గా ఉందాం- సీఎంలకు మోదీ సలహా

NEXT PREV

PM Modi Meeting: దేశంలో కరోనా తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ‍్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతోన్న వేళ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. ఫోర్త్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నందున అలసత్వం వహించరాదని కోరారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను భారత్ దీటుగా ఎదుర్కొందని మోదీ అన్నారు.










కొద్ది రోజులుగా దేశంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో కోవిడ్‌ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర అంశం. కనుక మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ సవాలును అధిగమించాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం చాలా ముఖ్యం. ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించవద్దు. కరోనా ఫోర్త్ వేవ్ వస్తే సమర్థంగా ఎదుర్కోవాలి. అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలి.                                                                 - ప్రధాని నరేంద్ర మోదీ


వ్యాక్సినేషన్


దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని మోదీ అన్నారు. మన దేశ వయోజన జనాభాలో 96% మంది మొదటి డోస్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తైందని వెల్లడించారు. పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.


Also Read: PM MOdi On Petrol Prices : పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి - సీఎంలకు ప్రధాని సూచన !


Also Read: Thanjavur Chariot Incident: రథోత్సవంలో అపశ్రుతిపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం

Published at: 27 Apr 2022 03:57 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.