Sonia Gandhi Covid Positive:  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కరోనా నుంచి త్వరగా రికవర్ అవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.






సోనియా గాంధీకి గురువారం కరోనా పాజిటివ్ వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సిన వేళ సోనియాకు వైరస్ సోకింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపా



కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప జ్వరంతో పాటు ఆమెకు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం సోనియా గాంధీ ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్య సాయం అందించారు. అయితే జూన్ 8న ఆమె ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.                                                                            "
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ నేత




 

సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. దీంతో ఇటీవల సోనియాను కలిసిన నేతలంతా ఐసోలేషన్‌లో ఉన్నారు.


ఈడీ నోటీసులు


నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం జూన్ 8న సోనియాను హాజరుకావాలని ఈడీ నోటీసులో సూచించింది. రాహుల్ గాంధీ గురువారం హాజరుకావాల్సి ఉంది. అయితే తాను కూడా సోనియా గాంధీతో కలిసి విచారణకు హాజరవుతానని రాహుల్ గాంధీ.. ఈడీని కోరినట్లు తెలుస్తోంది.


Also Read: CM Arvind Kejriwal: 'ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి'- ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్


Also Read: J&K: బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు- కశ్మీరీ పండిట్ల సంచలన నిర్ణయం