CM Arvind Kejriwal: 'ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి'- ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్

ABP Desam   |  Murali Krishna   |  02 Jun 2022 05:28 PM (IST)

CM Arvind Kejriwal: ప్రధాని నరేంద్ర మోదీకి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఎలాంటి కేసులు కావాలన్నా పెట్టుకోవాలన్నారు.

'ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి'- ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్

CM Arvind Kejriwal: దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇలా ఒక్కరొక్కర్ని అరెస్ట్ చేయడం కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేసేయండని సవాల్ విసిరారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నాదొక విజ్ఞప్తి. ఒక్కొక్కరిని ఎందుకు జైలుకు పంపిస్తున్నారు? ఇలా చేయడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేయండి. ఏమేం కేసులు పెట్టాలని అనుకుంటున్నారో అన్ని కేసులు ఒకేసారి పెట్టేయండి. అలాగే ఇప్పుడు ఉన్న కేంద్ర ఏజెన్సీలన్నింటినీ పిలిచి విచారణ చేపట్టండి. ఆ తర్వాతే మేం మా పని చేసుకుంటాం.                                                     - కేజ్రీవాల్, దిల్లీ సీఎం

ఇంకా ఉన్నాయ్

ఆమ్‌ఆద్మీ పార్టీకి విచారణలు కొత్తేం కాదని కేజ్రీవాల్ అన్నారు. ఐదేళ్ల క్రితం ఆప్ నేతలపై ఇలాంటి తప్పుడు కేసులే పెట్టారని గుర్తు చేశారు. ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా తప్పుడు కేసులు పెట్టే కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీలో విద్య, వైద్యం అత్యుత్తమంగా తీర్చిదిద్దామని, వాటిని ఆపేందుకే భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. 

రాజకీయ దురుద్దేశంతోనే సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ కూడా గతంలో సత్యేంద్ర జైన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఇప్పుడు ఈడీ దర్యాప్తు సాగిస్తోందని, మళ్లీ మరోసారి ఆయన క్లీన్‌చిట్‌తో బయటపడతారని కేజ్రీవాల్ అన్నారు. జైన్ ఎలాంటి కళంకం లేకుండా బయటపడాతారనే నమ్మకం తనకు ఉందన్నారు.

హవాలా కేసులో అరెస్ట్ చేసిన సత్యేంద్ర జైన్‌ను జూన్ 9 వరకూ కస్టడీకి అప్పగిస్తున్నట్లు రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ఆదేశించింది. సత్యేందర్ జైన్‌ను ఈడీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.

ఇదీ కేసు

సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన కొన్ని కంపెనీలపై ఈడీ ఇటీవల విచారణ జరుపుతోంది.  కొన్ని చోట్ల సోదాలు నిర్వహించింది. కోల్‌కతాలో కొన్నిసోదాలు నిర్వహించినప్పుడు అక్కడి కంపెనీ సాయంతో మనీ లాండరింగ్ నిర్వహించినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సోదాలు జరిపినప్పుడే దాదాపుగా రూ. నాలుగు కోట్ల 81  లక్షల సొమ్ము సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన సంస్థల్లోకి అక్రమంగా వచ్చినట్లుగా గుర్తించారు. ఈ సొమ్మును అప్పుడే అటాచ్ చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు.

Also Read: J&K: బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు- కశ్మీరీ పండిట్ల సంచలన నిర్ణయం

Also Read: Sonia Gandhi Corona Positive: ఈడీ విచారణ వేళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ 

Published at: 02 Jun 2022 05:00 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.