Sonia Gandhi Corona Positive: ఈడీ విచారణ వేళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

ABP Desam   |  Murali Krishna   |  02 Jun 2022 01:12 PM (IST)

Sonia Gandhi Corona Positive: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా సోకింది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

Sonia Gandhi Corona Positive: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సిన వేళ సోనియాకు వైరస్ సోకింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప జ్వరంతో పాటు ఆమెకు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం సోనియా గాంధీ ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్య సాయం అందించారు. అయితే జూన్ 8న ఆమె ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.                                                                           - రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ నేత

సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. దీంతో ఇటీవల సోనియాను కలిసిన నేతలంతా ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం జూన్ 8న సోనియాను హాజరుకావాలని ఈడీ నోటీసులో సూచించింది. రాహుల్ గాంధీ గురువారం హాజరుకావాల్సి ఉంది. అయితే తాను కూడా సోనియా గాంధీతో కలిసి విచారణకు హాజరవుతానని రాహుల్ గాంధీ.. ఈడీని కోరినట్లు తెలుస్తోంది. 

Also Read: Bangaldeshi Woman: ప్రేమ కోసం బంగ్లాదేశ్ యువతి సాహసం- అడవులు దాటి, సముద్రాన్ని ఈది భారత్‌కు!

Also Read: Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 3,712 మందికి వైరస్

Published at: 02 Jun 2022 12:57 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.