NDA Meeting: NDAకి కొత్త అర్థం చెప్పిన మోదీ, విపక్ష కూటమికి పోటీగా - ఎవరొచ్చినా స్వాగతిస్తామని వెల్లడి

ABP Desam Updated at: 18 Jul 2023 10:29 PM (IST)

NDA లో ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్‌మెంట్, ఏ అంటే ఆస్పిరేషన్ అని ప్రధాని మోదీ అన్నారు.

ఎన్టీఏ సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

NEXT PREV

ఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ తమ కూటమికి కొత్త అర్థం చెప్పారు. NDA లో ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్‌మెంట్, ఏ అంటే ఆస్పిరేషన్ అని ప్రధాని మోదీ అన్నారు. నేడు బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీలో వారి కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నందున తాజాగా మోదీ ఎన్డీఏకు కొత్త అర్థం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 






అలాగే ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలకు తాము ఎప్పుడూ స్వాగతం పలుకుతామని ప్రధాని మోదీ చెప్పారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏనే కీలక పాత్ర పోషించిందని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉందని ప్రధాని అన్నారు.


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వమేనని, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, గులాం నబీ ఆజాద్ వంటి ఎందరో నేతలకు పద్మ సమ్మాన్ ఇచ్చామని గుర్తు చేశారు.


ఎన్డీయే కూటమి అనేది మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌, రామ్‌మనోహర్‌ లోహియా పిలుపునిచ్చిన మార్గంలో వెళ్తోందని మోదీ చెప్పారు. ఓటర్ల తెలివితేటలను ప్రతిపక్షాలు తక్కువగా అంచనా వేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కేవలం పోటీతత్వం మాత్రమే ఉంటుందని, అది ఏనాడూ శత్రుత్వంగా మారకూడదని చెప్పారు. కానీ, ప్రస్తుత ప్రతిపక్షం మాత్రం అధికారంలో ఉన్న వారిని తరచూ తిట్టడమే పనిగా పెట్టుకుందని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సానుకూలంగా రాజకీయాలు చేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు.



మేం ఎప్పుడూ ప్రతికూల రాజకీయాలు చేయలేదు. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వాలను ఎదిరించి వారి కుంభకోణాలను బయటపెట్టాం తప్ప అధికారంలో ఉన్నవారిని అవమానించలేదు.-


ప్రపంచ దేశాలు కూడా 2024లో మళ్లీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాయని అన్నారు. అమెరికా, బ్రిటన్‌, యూఏఈ తదితర దేశాలు ఎన్డీఏ ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకోవాలని చూస్తున్నాయని చెప్పారు.


వాళ్లు ఎందుకు ఏకం అవుతున్నారో ప్రజలకి తెలుసు - మోదీ


విపక్షాల సమావేశం గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. ఇంతమంది దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, తాము మాత్రం ఏకం చేస్తున్నామని అన్నారు. వీళ్లు ఎందుకు ఏకమవుతున్నారో జనం అంతా చూస్తున్నారని అన్నారు. వాటిని కలుపుతున్న జిగురు ఏంటో కూడా ప్రజలకు తెలుసని అన్నారు. ఎన్డీఏపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మోదీ అన్నారు. మన దేశ రాజకీయాల్లో పొత్తుల సంప్రదాయం చాలా కాలంగా ఉందని, కానీ ప్రతికూలతతో ఏర్పడినవి ఎప్పుడూ విజయవంతం కాలేదని మోదీ అన్నారు. తాము ఎప్పుడూ ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు తాము ఎప్పుడూ విదేశాల నుంచి సహాయం కోరలేదని అన్నారు.


Also Read: విపక్ష కూటమి కొత్త పేరు ఇండియాపై అసోం సీఎం సెటైర్లు, భారత్ కోసం బీజేపీ అని ట్వీట్

Published at: 18 Jul 2023 09:35 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.