Assam CM Himanta On INDIA: బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విపక్షాల కూటమి సమావేశంపై విమర్శలు చేశారు. విపక్షాల కూటమి రెండో రోజు సమావేశంలో భాగంగా మంగళవారం తమ కూటమికి  ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు. దేశ సంస్కృతి, నాగరికత వైరుద్ధ్యం భారత్, ఇండియా మధ్య ఉందన్నారు. మన దేశాన్ని కలోనల్ లెగసీ నుంచి విముక్తి  కల్పించాలని అభిప్రాయపడ్డారు. 


విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని నామకరణం చేయడాన్ని అసోం సీఎం హిమంత తప్పుపట్టారు. ఆ పేరును లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే.. మన నాగరికత వివాదం అంతా ఇండియా, భారత్ చుట్టూ నెలకొందన్నారు. మన దేశానికి బ్రిటిష్ వారు భారతదేశం అని పేరు పెట్టారు. నేడు విపక్షాల కూటమి అదే పేరు పెట్టుకోవడంతో.. వలస వారసత్వాల నుంచి విముక్తి పొందడానికి పోరాడాలని ప్రయత్నించాలి. గతంలో మన పూర్వీకులు భారత్ కోసం పోరాడారని, ఇప్పుడు మనం సైతం భారత్ కోసం పోరాటం కొనసాగిద్దామని పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.






బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష సమావేశం రెండో రోజు  కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు తమ కూటమికి కూటమికి  I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా నామకరణం చేశారు. గతంలో ఈ కూటమి యూపీఏగా ఉండేది. ఇక నుంచి తమ కూటమి ఇండియా అని, దేశాన్ని ఎన్డీఏ నుంచి విముక్తి కల్పించడమే తమ ధ్యేయం అని ప్రకటించారు. 


మరోవైపు ఢిల్లీలో నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్డీఏ) సమావేశం కొనసాగుతోంది.  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సమావేశంలో 38 పార్టీలు పాల్గొన్నాయి. వచ్చే ఏడాది 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార కూటమి పార్టీల నేతలు ఢిల్లీలో కీలక భేటీలో ప్రతిపక్షాల కూటమిని ఓడించడంపై చర్చిస్తున్నారు. 1998లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య 24 ఉండగా, నేడు ఆ సంఖ్య 38కి పెరిగిందన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఎన్డీఏ కూటమి విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాధరణను తెలియజేస్తుందన్నారు.


ఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్డీఏ ఏర్పాటై 25 పూర్తయిందన్నారు మోదీ. దేశ ప్రజల ఆకాంక్షను ఎన్డీఏ నెరవేర్చిందన్నారు. ఎన్డీఏతో కలిసి వచ్చిన పార్టీలకు అభినందనలు తెలిపారు. దేశ పునర్ నిర్మాణంలో ఏన్డీఏ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial