Vande Bharat Express: 


ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం 11 రాష్ట్రాల్లో 9 కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఝార్ఖండ్, గుజరాత్‌ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవభారత స్ఫూర్తికి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నిదర్శనమని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ - బెంగళూరు మధ్య, విజయవాడ-చెన్నై మధ్య ఈ కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.