డీమానిటైజేషన్ తర్వాత కొత్త కరెన్సీ నోట్ల గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో అనేక పుకార్లు వస్తున్నాయి. దొంగ నోట్లు ఎక్కువగా వస్తున్నాయని.. అనేక పుకార్లు వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకానికి దగ్గరగా కాకుండా..  మహాత్మాగాంధీ చిత్రపటం పక్కనే గ్రీన్ స్ట్రిప్‌తో కూడిన రూ.500 నోటు ఉంటే.. అది నకిలీ నోటు అని జాగ్రత్తపడాలని తాజాగా పుకారు లేచింది.  


ఈ నోట్లపై పుకార్లు వచ్చాయంటే.. జనాలు, వ్యాపారులు తీవ్రంగా భయపడతారు. ఇతర పుకార్ల మాదిరిగానే దీనితోనూ వారిలో ఆందోళన నెలకొంది. రూ.500 నోటు తీసుకోవడంపై కొంతమందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఐబీ) మాత్రం ఇది కేవలం పుకారు మాత్రమేనని.. ఆ నోటు నకిలీ కరెన్సీ కాదని పేర్కొంది. అంతేకాదు దానికి సంబంధించి ట్వీట్ చేసింది.






సోషల్ మీడియాలో  వస్తున్న ఫేక న్యూస్ పై పీఐబీ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాల్లో వాస్తవానికి సంబంధించిన విషయాన్ని పోస్ట్ చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ సంతకం లేదా మహాత్మా గాంధీ చిత్రం దగ్గర గ్రీన్ స్ట్రిప్‌తో ఉన్న రెండు రకాల రూ. 500 నోట్లు సరైన కరెన్సీ అని వివరిస్తూ పీఐబీ ఒక వీడియోను పోస్ట్ చేసింది.


'ఆర్‌బీఐ గవర్నర్ సంతకానికి బదులుగా  గాంధీజీ చిత్రపటం దగ్గర గ్రీన్ స్ట్రిప్ ఉన్న 500 రూపాయల నోటును తీసుకోవద్దని పుకార్లతో హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో ఫేక్. RBI ప్రకారం, రెండు నోట్లు చట్టబద్ధమైనవి.' అని పీఐబీ ట్వీట్ చేసింది.


మీరూ తెలుసుకోండి.. 


పీఐబీ..  నకిలీగా ఉండే చిత్రాలు, వీడియోలు మరియు కథనాలను పంపడానికి అనుమతిస్తుంది. దానిపై తనిఖీ చేస్తుంది. ఇలా చేసిన నిజం ఏంటో తెలుసుకోవచ్చు.
www.factcheck.pib.gov.inకి వెళ్లి, చిత్రం లేదా వీడియోను అప్‌లోడ్ చేయండి. లేదా వాట్సాప్ నంబర్ +91-8799711259కి సందేశం ద్వారా చిత్రం లేదా వీడియోను పంపండి. pibfactcheck@gmail.comకి ఇమెయిల్ ద్వారా ఫైల్‌లను పంపించి.. నిజమేంటో తెలుసుకోవచ్చు.


Also Read: CoWIN App Registration: పిల్లలకు కొవిడ్ టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్.. ఎలా చేయాలంటే..?


Also Read: Chattisgarh Encounter: గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్


Also Read: Actress Suicide: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్