దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 


భారత తొలి సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్​కు మరణానంతరం పద్మ విభూషణ్​ ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ఆయన కుమార్తెలు క్రితిక, తరణి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ​కాంగ్రెస్ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్‌కు​ పద్మ భూషణ్​ అవార్డు దక్కింది. 







ఇంకెవరికంటే?



  • పారా షూటర్ అవనీ లేఖరాకు క్రీడా రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు దక్కింది.

  • హాకీ ప్లేయర్ వందనా కటారియా పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు.

  • సాహిత్యం, విద్యా రంగంలో చేసిన సేవలకు గాను సచిదానంద స్వామికి పద్మ భూషణ్ ఇచ్చారు.

  • సాహిత్యం, విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గాను రాధే శ్యామ్ ఖెమ్కాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఆయన కుమారుడు అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.

  • సినిమా రంగానికి గాను డైరెక్టర్ చంద్ర ప్రకాశ్ ద్వివేదీ పద్మ శ్రీ తీసుకున్నారు.










 




విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది కేంద్రం పద్మ అవార్డులను ప్రకటిస్తుంది.

 

మొత్తం 128 పద్మ పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించిన కేంద్రం..17 మందిని పద్మభూషణ్‌, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. రెండో విడత అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది