దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్ మెల్లగా విస్తరిస్తోంది. కొత్తగా తమిళనాడులో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వెల్లడించారు. బంగాల్​లోని ముర్షిబాద్ జిల్లాలోనూ తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. బాలుడు అబుదాబి నుంచి హైదరాబాద్​కు, అక్కడి నుంచి బంగాల్​కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. 69కి చేరింది. తెలంగాణలో 3 కేసులు నమోదవ్వగా.. ఏపీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది.


దేశంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరగా.. ఒక్క మహారాష్ట్రలోనే 32 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బంగాల్, ఛండీగఢ్, ఢిల్లీ లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాజస్థాన్​లో ఒమిక్రాన్ బారినపడిన వారంతా కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్రం వివరించింది.






మరోవైపు ఒమిక్రాన్ పై కేంద్రం హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలి చెబుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్ , కర్ణాటక, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్, బంగాల్, తమిళనాడు, ఢిల్లీ, చండీగఢ్​లో, బంగాల్ లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలిపింది. కరోనా నిబంధనలు పాటించాలని టీకాలు వేసుకోవాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించిందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.


దేశంలో కరోనా కేసులు


దేశంలో కొత్తగా 6,984 కోరనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,10,628కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 87,562కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.



  • కొత్త కేసులు: 6,984 

  • మొత్తం రికవరీలు: 8,168

  • కొత్త మరణాలు: 247 


మొత్తం మరణాల సంఖ్య 4,76,135కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.


Also Read: Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి


Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి