Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంపై రైల్వే చర్యలు ప్రారంభించింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే జీఎంపై బదిలో వేటు వేసింది. రైల్వే బోర్డు సిఫార్సు మేరకు కేబినెట్ నియామకాల కమిటీ చర్యలు తీసుకుంది. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ అధికారి అనిల్ కుమార్ మిశ్రాను సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ గా నియమించింది. అర్చన జోషిని కర్ణాటక యలహంకలోని రైల్ వీల్ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ గా బదిలీ చేసింది. గతంలోనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్ సహా ఐదుగురు సీనియర్ జోన్ అధికారులను బదిలీ చేసింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి రైల్వే శాఖ సౌత్ ఈస్టర్న్ రైల్వేకు చెందిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. మరోవైపు సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సీనియన్ ఐపీఎస్ అధికారి విప్లవ్ కుమార్ చౌదరి పదవీకాలాన్ని పొడిగించినట్లు వార్తలు రాగా.. తాజాగా వాటిపైనా క్లారిటీ వచ్చింది. సీబీఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న, ప్రస్తుతం ఒడిశా రైలు ప్రమాదంలో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న విప్లవ్ కుమార్ చౌదరి పదవీకాలాన్ని ఏడాదిన్నర కాలం పొడిగించడానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వుల్లో తెలిపింది.






ప్రమాదం ఎలా జరిగిందంటే..


ఒడిశాలో జూన్ 2న రైలు ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూరు - హావ్ డా ఎక్స్‌ప్రెస్‌ కు.. కోరమాండల్ బోగీలు ఢీకొట్టడంతో ఆ రైలు వెనక ఉన్న పలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓవర్ హెడ్ లోటెన్షన్ లైన్ కరెంట్ వైర్లు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో కరెంట్ పాసై విద్యుదాఘాతం జరిగిందని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 293 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బోగీల మధ్య నలిగిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి.


Also Read: Aspartame: WHO చెప్పిన అస్పర్టమే అంటే ఏంటి? దీంతో క్యాన్సర్ వస్తుందా? ఈ ఉత్పత్తుల్లోనే ఎక్కువ!


అదానీ, అంబానీ సాయం..


ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని గౌతమ్ అదానీ ప్రకటించారు. వారి చదువుకు అయ్యే ఖర్చునంతా తామే భరిస్తామన్నారు. ఉచితంగా విద్యను అందించి వారికి మంచి భవిష్యత్ కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. 'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో అందరం తీవ్రంగా కలత చెందాం. ఈ ఘోర దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పాఠశాల విద్యను అందించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది. బాధితులను ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. వారి కుటుంబాలకు, పిల్లలకు మంచి భవిష్యత్ అందించండి' అంటూ గౌతమ్ అదానీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఒడిశా ప్రమాదం తర్వాత రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ భారీ ప్యాకేజ్ ప్ర‌క‌టించింది.. ఉద్యోగ క‌ల్ప‌న‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు స‌ర‌ఫ‌రా, మెడిక‌ల్ ఎయిడ్, వంటి వాటిని ఉచితంగా అంద‌జేసేందుకు 10 అంశాల కార్య‌క్ర‌మాన్ని తీసుకుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial