Aspartame: అస్పర్టమే.. ఇదో పాపులర్ అర్ఠిఫీషియల్ స్వీటెనర్. అంటే కృత్రిమ చక్కెర. తినుబండారాలు, పానీయాలు తీయగా ఉండేందుకు ఈ కృత్రిమ చక్కెరను ఉపయోగిస్తారు. ఇది చక్కెర కన్నా 200 రెట్లు అధికంగా తియ్యగా ఉంటుంది. ఇది అమైనో యాసిడ్స్, అస్పార్టిక్ యాసిడ్స్, ఫినైలాలనైన్ మిశ్రమంతో తయారు చేస్తారు. షుగర్ ఫ్రీ అని ట్యాగ్‌తో వచ్చే దాదాపు అన్ని ఉత్పత్తుల్లో ఈ అస్పార్టమే ఉంటుంది. దీని వల్లే అవి చక్కెర లేకపోయినా తీయగా ఉంటాయి. చక్కెర లేకుండా తీయని రుచిని ఇచ్చే ఈ అస్పర్టమే వాడకంపై చాలానే ఆరోపణలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికీ దీని వాడకంపై సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. 


అస్పర్టమే ఏయే ఉత్పత్తుల్లో ఉంటుందంటే..


* కోకా కోలా డైట్ కోక్
* షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్
* షుగర్ ఫ్రీ డెజర్ట్ మిక్స్
* స్నాపిల్ జీరో షుగర్ టీ, జ్యూస్ డ్రింక్స్
* షుగర్ ట్విన్ 1 స్వీటెనర్ ప్యాకెట్స్
* ఈక్వల్ జీరో కేలరీ స్వీటెనర్స్
* ట్రిడెంట్ షుగర్ ప్రీ పెప్పర్‌మెంట్ గమ్స్
* షుగర్ ఫ్రీ క్యాండీలు
* పౌడర్ స్వీటెనర్లు
* యోగర్ట్, కొన్ని డెయిరీ ఉత్పత్తులు
* కొన్ని మిఠాయిలు


Also Read: కూల్‌డ్రింక్స్‌ కంపెనీలకు షాక్ ఇవ్వబోతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ- సెలబ్రిటీలకు బదులు ముకేష్ కనిపిస్తాడేమో!


కార్సినోజెన్ అంటే ఏంటి?


కార్సినోజెన్ అంటే క్యాన్సర్ కారకాలు అని అర్థం. క్యాన్సర్ ను కలిగించే వాటినే క్యాన్సర్ కారకాలు అంటారు. కార్సినోజెన్ లలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి. కార్సినోజెనిక్, ప్రాబప్లీ కార్సినోజెనిక్, పాసిబ్లీ కార్సినోజెనిక్, నాట్ క్లాసిఫియేబుల్. అస్పర్టమేను పాసిబ్లీ కార్సినోజెనిక్ కింద క్యాన్సర్ కారకంగా చూడవచ్చని రాయిటర్స్ నివేదిక చెబుతోంది. 


క్యాన్సర్‌కు కారణమయ్యే ఇతర పదార్థాలు


* కార్పెంట్ పనిలో ఉపయోగించే రసాయనాలు
* ట్రెడిషనల్ ఏషియన్ పిక్డ్ వెజిటేబుల్స్
* ప్రింటింగ్ ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు
* డ్రై క్లీనింగ్ లో ఉపయోగించే రసాయనాలు
* రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాలు
* మద్యం
* వాయు కాలుష్యం
* బొగ్గు ఉద్గారాలు
* ధూమపానం
* ప్రాసెస్ చేసిన మాంసం
* X, గామా రేడియేషన్
* చెక్క దుమ్ము
* నల్లమందు వాడకం
* ఫార్మాల్డిహైడ్
* యూవీ కిరణాలు


అస్పర్టమే ఉపయోగించే కూల్ డ్రింక్ సంస్థలకు షాక్!


క్యాన్సర్ కు కారణమయ్యే అస్పర్టమే అనే కృత్రియ స్వీటెనర్లు ఉండే కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న కంపెనీలకు షాక్ ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమవుతోంది. అస్పర్టమే వాడి తయారు చేసే కూల్ డ్రింక్స్ సీసాలపై, టిన్నులపై ఇది క్యాన్సర్ కు కారకం అని ముద్రించేలా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సర్వే చేసిన రిపోర్టు ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. దీంతో కూల్ డ్రింక్ కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే సమావేశం కాగా.. ఆ నిర్ణయాలను జులై 14వ తేదీన ప్రకటించనున్నట్లు సమాచారం. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు ఎప్పుడూ చెప్పే మాట. అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial