కృష్ణని మురారీ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకి తీస్తాడు. తను ఎంతకీ కళ్ళు తెరవకపోయేసరికి కంగారుపడతాడు. తనని ఎత్తుకుని తీసుకుని వెళ్లబోతుంటే ముకుంద ఎదురుపడుతుంది. తనని చూసి షాక్ అవుతాడు.


ముకుంద: వావ్ సూపర్ నారీ నారీ నడుమ మురారీ టైటిల్ సెట్ అవుతుంది


మురారీ: నువ్వేంటి ఇక్కడ?


ముకుంద: రాననుకున్నావా? రాలేననుకున్నావా?


మురారీ: అన్ని గమనిస్తున్నా. జస్ట్ గివ్ మీ ఎ బ్రేక్ విత్ ఇన్ షాట్ బ్రేక్ లో మళ్ళీ కలుసుకుందాం


Also Read: రుద్రాణికి రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్- స్వప్న ప్లాన్ అట్టర్ ప్లాప్, గుర్రుపెట్టి పడుకున్న రాహుల్


అనేసి కృష్ణని తీసుకుని వెళ్ళి గదిలో పడుకోబెడతాడు. తెల్లారి తనకి మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి మురారీకి ప్రయాణం లేచివచ్చినట్టు అవుతుంది. కృష్ణ జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలా కనిపించేసరికి మురారీ పగలబడి నవ్వుతాడు. అంత ప్రాణాపాయం నుంచి బయట పడ్డానని జాలి లేకుండా నవ్వుతారా అనేసరికి సోరి చెప్తాడు. కాసేపు బుంగమూతి పెడుతుంది. ముద్దుగా బతిమలాడతాడు. భవానీ మురారీకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆదర్శ్ గురించి ఎంక్వైరీ ఎంత వరకు వచ్చిందని ఆరా తీస్తుంది. వాడు కనిపించకుండా పోయి తొమ్మిది నెలలు అయ్యింది ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతుంది. ఖచ్చితంగా ముకుంద పెద్దమ్మకి ఫోన్ చేసి చెప్పి ఉంటుందని మురారీ డౌట్ పడతాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సీన్ వచ్చేసింది. మురారీ కోసం ముకుంద వెయిట్ చేస్తుంటే వస్తాడు.


మురారీ: ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకని చెప్పే రోజు కోసమే ఎదురుచూస్తున్నా


ముకుంద: కానీ అలాంటి రోజు మన మధ్య ఎందుకు వస్తుంది


మురారీ: ఆల్రెడీ ఆ రోజు ఎప్పుడో వచ్చేసింది. ఇంకెప్పుడు మనం కలిసే అవకాశం ఉండదని చెప్పడానికి వచ్చాను


ముకుంద: ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్


మురారీ: నీకోక విషయం చెప్పడానికి వచ్చాను


ముకుంద: కృష్ణని ప్రేమించిన విషయం మాత్రం చెప్పకు నాకున్న ఒక్క హోప్ కూడా పోతుందని మనసులో అనుకుని మ్యాటర్ డైవర్ట్ చేసేందుకు ట్రై చేస్తుంది. కృష్ణకి ఏమైందని అడుగుతుంది. తనని కాపాడటం కోసమే అలా ఎత్తుకున్నావ్ అర్థం చేసుకుంటాను


మురారీ: మనది ఇప్పుడు ప్రేమ కాదు


ముకుంద: ప్రేమలో ఇవన్నీ ఏంటి ఒకప్పటి ప్రేమ ఇప్పుడు ఫ్రెండ్షిప్ అవుతుందా?


Also Read: యష్, వేద రొమాంటిక్ డేట్- మాళవికని వాయించేసిన సులోచన


మురారీ: ఆవేశంగా చెప్పాలని వచ్చాను కానీ నోరు రావడం లేదు నీతో ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ చెప్పకపోతే కృష్ణ నాకు దూరంఅవుతుందని మనసులో అనుకుంటాడు. నేను కృష్ణని ప్రేమిస్తున్నా. నేను నా భార్యని ప్రేమిస్తున్నా.. నువ్వు కూడా నీ భర్తని ప్రేమించు


ముకుంద: అలా ఎలా చెప్పగలుగుతున్నావ్


మురారీ: ఎందుకంటే అది నిజం


ముకుంద: నాకు కావలసింది నీ ప్రేమ


మురారీ: అది నీకు ఎప్పటికీ దక్కదు. ఎందుకంటే ఆదర్శ్ నా ప్రాణ స్నేహితుడు వాడి భార్యని ప్రియురాలిగా చూడలేను


ముకుంద: నాలో ఎప్పటికీ మార్పు రాదు, నా ప్రేమలో డైవర్షన్ ఉండదు. నా విషయంలో ఎప్పుడూ తప్పు చేశానని అనిపించలేదా?


మురారీ: అనిపించింది.. నా ఫ్యామిలీ కోసం ఆలోచించి నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేయడమే. నువ్వు ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడి భార్యవి నిన్ను నేను.. చెప్పడానికి అసహ్యంగా ఉంది అర్థం చేసుకో. అయినా దేవుడు మంచే చేశాడు బంగారం లాంటి వాడిని నీకు భర్తగా చేశాడు


ముకుంద: ఇక చాలు ఆపు. నేను నా తలరాతని మార్చుకుంటాను. కృష్ణని నువ్వు ఎలా ప్రేమిస్తావో నేను చూస్తాను


మురారీ: నువ్వు ఎలా చూస్తావో నేను చూస్తాను


ముకుంద: మీ అగ్రిమెంట్ మ్యారేజ్, మన ప్రేమ విషయం భవానీ అత్తయ్యకి చెప్తాను. ఆదర్శ్ ని పెళ్లి చేసుకోమనీ నువ్వు నన్ను ఎంత ఫోర్స్ చేశావో చెప్తాను. నేను బతికుండగా నా ప్రేమ నీదే.. నీ ప్రేమ నాదే


మురారీ: మంచిది గుడ్ లక్ నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇక నీ ఇష్టం అనేసి వెళ్లిపోయేసరికి ముకుంద గుండె పగిలేలా ఏడుస్తుంది.


ఎప్పటికైనా ఇవన్నీ అందరికీ తెలియాలి కాబట్టి మెంటల్ గా ప్రిపేర్ అవుతాను. ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళ్లిపోవాలని అనుకుంటాడు. కృష్ణ వస్తే వెళ్లిపోదామని చెప్తాడు.