Odisha Train Accident LIVE: రైలు ప్రమాదంలో 288 మంది మృతి, మరో 56 మంది పరిస్థితి విషమం
Odisha Train Accident LIVE Updates: షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ కు సమీపంలో బహనాగా స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొన్న అనంతరం పట్టాలు తప్పింది.
#OdishaTrainTragedy శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కు చేరుకుంది. 56 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, మరో 747 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత మంది చనిపోవడం కలచివేసిందన్నారు. బాలాసోర్ మెడికల్ కాలేజీకి వెళ్లిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుకున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తాం, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం అన్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైలు పట్టాలను మరమ్మతులు చేపట్టి, రైలు సర్వీసులను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తోందన్నారు. రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిని, బాధితులను కలిశాను.. ప్రమాదంపై మాట్లాడేందుకు తనకు నోట మాట రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన స్థలానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రాథమిక రిపోర్టును ప్రధానికి వివరిస్తున్నారు. అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారు.
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 261కి పెరిగింది.
ఒడిశాలోని బాలాసోర్ లో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనే 1981లో జరిగింది. ఈ రైలులో ఎలాంటి యాంటీ కొలిషన్ పరికరం లేదని, అది ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తాం. సహాయ, పునరావాస చర్యల్లో ఒడిశా ప్రభుత్వానికి, రైల్వేకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
ఒడిశాలోని బాలాసోర్ లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ప్రధాని స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శిస్తారని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి.
ఒడిశా రైలు ప్రమాదంలో గుట్టగుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాల తరలింపు సమస్యగా మారుతున్న వేళ వాయిసేన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. మృతదేహాల తరలింపు కోసం ఎంఐ -17ని రంగంలోకి దింపింది.
ప్రధాని మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. తొలుత బాలాసోర్ లో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, అనంతరం కటక్ లోని ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 238 మంది మృతి చెందితే... అందులో తెలుగువాళ్లే వంద మందికిపైగా ఉన్నారని సమాచారం అందుతోంది.
ఒడిశా రైలు ప్రమాదంపై వివరాలకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు విజయవాడ,రాజమండ్రి లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.
విజయవాడకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
Rly -67055
BSNL- 0866 2576924
రాజమండ్రికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
BSNL: 08832420541
RLY: 65395
దక్షిణ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్, సికింద్రాబాద్: 040 - 27788516
విజయవాడ : 0866-2576924
రాజమండ్రి : 0883-2420541
సామర్లకోట: 7780741268
ఏలూరు: 08812-232267
తాడేపల్లిగూడెం: 08818-226212
బాపట్ల: 08643-222178
తెనాలి: 08644-227
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పాట్ ఆయన మాట్లాడుతూ... ఇది చాలా పెద్ద విషాదం. అన్ని విభాగాల బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఎక్కడ ఉత్తమ సౌకర్యాలు ఉంటే అక్కడ ఆరోగ్య చికిత్స జరుగుతుంది. ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశామని, ఈ ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని, మొత్తం ఘటన ఎలా జరిగిందో తెలుసుకుంటాం. ప్రస్తుతం అందరి దృష్టీ రెస్క్యూపైనే ఉంది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోల్ కతా పర్యటనను రద్దు చేసుకుని ఒడిశాలోని బాలాసోర్ కు చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో రానున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగన్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరింది. రాత్రి నుంచి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. క్షతగాత్రులతో ఆస్పత్రులు కిక్కిరిసి పోయింది
బాలాసోర్ చేరుకున్న టీఎంసీ ఎంపీ డోలా సేన్ మాట్లాడుతూ తన జీవితంలో ఇలాంటి దురదృష్టకరమైన ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. రెండు ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. రెండు రైళ్లలో 3000-4000 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉదయం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 207కు పెరిగింది. బోగీలు తొలగిస్తున్నారు ఈ పరిస్థితిలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.
రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి అత్యవసర సహాయనిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ.
ముంబై-గోవా వందే భారత్ రైలు ప్రారంభోత్సవం రద్దు చేశారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా రేపు జరగాల్సిన ముంబై-గోవా వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయింది.
రైలు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటన మనసుల్ని కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను అని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పుర రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో సుమారు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 350 మంది గాయపడ్డారు. ప్రమాదంలో బాధితులకు రైల్వే మంత్రి అశ్విన వైష్ణవ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలు లేదా వైకల్యం ఏర్పడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు విజయవంతం చేయాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.
హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్ ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నా ఆలోచనలు బాధితుల గురించి. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
తమిళనాడుకు చెందిన ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో సీఎం ఎంఎకే స్టాలిన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఒడిశా సీఎం పట్నాయక్ స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ప్రమాదం వివరాలపై సమీక్షిస్తున్నారు.
తమిళనాడుకు చెందిన ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో సీఎం ఎంఎకే స్టాలిన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఒడిశా సీఎం పట్నాయక్ స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ప్రమాదం వివరాలపై సమీక్షిస్తున్నారు.
12841 షాలిమార్ - చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఘటనపై హెల్ప్ లైన్ నెంబర్లు..
హౌరా హెల్ప్ లైన్ నెంబర్: 033-26382217
ఖరగ్ పూర్ హెల్ప్ లైన్ నెంబర్: 8972073925 & 9332392339
బాలాసోర్ హెల్ప్ లైన్ నెంబర్: 8249591559 & 7978418322
షాలిమార్ హెల్ప్ లైన్ నెంబర్: 9903370746
నెంబర్లకు సహాయం కోసం గానీ, వివరాల కోసం సంప్రదించాలని సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు సూచించారు.
షాలిమార్ - కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర ప్రజల కోసం ఒడిశా ప్రభుత్వంతో, సౌత్ ఈస్ట్రన్ రైల్వేలతో సమన్వయం చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాం అన్నారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్లు 033- 22143526/ 22535185 ఉన్నాయని మమతా బెనర్జీ తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎవరైనా వివరాల కోసం పైన తెలిపిన నెంబర్లకు ఫోన్ చేయాలని ఆమె సూచించారు.
పశ్చిమ బెంగాల్ (కోల్ కతా హౌరా) నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. షాలిమార్- కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాలాసోర్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టి, పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 7 బోగీలు పట్టాలు తప్పగా, దాదాపు 150 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతానికి 132 మందిని సోరో సీహెచ్‌సీకి, గోపాల్ పూర్ సీహెచ్సీ, ఖాంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలించినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు 50 అంబులెన్సులు కూడా సరిపోలేదని సమాచారం.
Background
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహనాగా స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొన్న అనంతరం పట్టాలు తప్పింది. 7 బోగీలు పట్టాలు తప్పిన ఈ ప్రమాదంలో 150 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. కోల్‌కతా నుంచి చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. 132 మందిని సోరో సీహెచ్‌సీకి, గోపాల్ పూర్ సీహెచ్సీ, ఖాంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలించినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ మీడియాకు వెల్లడించారు.
సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి 7 గంటల తరువాత ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంబులెన్సులలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీలైతే ప్రమాదం జరిగిన చోట కొందరికి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. అధికారులో బాలేశ్వర్ లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 044- 2535 4771, 06782 262286 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
హౌరా హెల్ప్ లైన్ నెంబర్: 03326382217
ఖరగ్ పూర్ హెల్ప్ లైన్ నెంబర్: 8972073925, 9332392339
బాలాసోర్ హెల్ప్ లైన్ నెంబర్: 8249591559, 7978418322
కోరమండల్ రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్ ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నా ఆలోచనలు బాధితుల గురించి. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి ప్రమీలా మల్లిక్, స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్‌ఆర్‌సీ)ని ఒడిశా సీఎం ఆదేశించారు. ఒడిశా ప్రత్యేక రిలీఫ్ కమీషనర్ (SRC), సీనియర్ అధికారులు హేమంత్ శర్మ, బల్వంత్ సింగ్, అరవింద్ అగర్వాల్, అగ్నిమాపక సేవల డీజీతో పాటు సహాయక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజా రైలు ప్రమాదంతో బాలాసోర్ జిల్లా, చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను అలర్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతానికి మూడు ఎన్టీఆర్ఎఫ్ టీమ్ లు, నాలుగు ODRAF టీమ్స్ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడు సీఎం ఎంఎకే స్టాలిన్ ఒడిశా సీఎంకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -