యాక్టివ్‌గా ఉన్న ఉద్యోగుల కంటే కేంద్రం నుంచి పింఛన్ తీసుకుంటున్న వారి సంఖ్యే భారీగా ఉందన్నారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్. ప్రస్తుతం పింఛన్ దారులు 77 లక్షల మంది ఉంటే... 50-60 లక్షల మంది యాక్టివ్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.
“నేడు, దాదాపు 6,000-7,000 మంది పింఛనుదారులు ‘100 ఏళ్లుకు మించిన వారు జీతంగా సంపాదించిన మొత్తాన్ని పెన్షన్‌గా తీసుకుంటున్నారు. దాదాపు లక్ష మంది పింఛనుదారులు '90 నుంచి 100 సంవత్సరాల' వయస్సు వాళ్లు ఉన్నారు.అని ఆయన అన్నారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లో సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం, విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పెన్షన్‌కు అర్హులని చేశాం, పింఛను/కుటుంబ పింఛన్‌కు సంబంధించిన ఏడేళ్ల సర్వీసు అర్హతను రద్దు చేశామని చెప్పారు. "ఫ్యూడల్ మనస్తత్వం నియంత్రణ పాలనను విముక్తి చేయడమే దీని ఉద్దేశ్యం అని ఆయన అన్నారు.
భవిష్య పోర్టల్‌తో కెనరా బ్యాంక్ పెన్షనర్స్ పోర్టల్‌ను ఇంటిగ్రేట్ చేయడంతోపాటు ‘SBI ఇంటిగ్రేటెడ్ పోర్టల్’లో కొత్త సేవలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఎక్స్‌ట్రార్డినరీ పెన్షన్ రూల్స్ బుక్, 2023ని కూడా ఆవిష్కరించారు.
11.25 లక్షల మంది పింఛనుదారులందరినీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పెన్షన్లు & పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి వి.శ్రీనివాస్ తెలిపారు. పెన్షనర్ల సంక్షేమం కోసం డిపార్ట్‌మెంట్ సులంభంగా సంప్రదించడానికి ఇది సహాయపడుతుందన్నారు. .
“ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్ పెన్షన్ సేవా పోర్టల్‌లను భవిష్య పోర్టల్‌తో అనుసంధానించే పని పూర్తయింది. ఈ ఇంటిగ్రేషన్‌తో, పెన్షనర్లు తమ పెన్షన్ స్లిప్, లైఫ్ సర్టిఫికేట్ సబ్‌మిట్ స్టేటస్, ఫారం-16 ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. పెన్షన్-విడుదల చేసే మొత్తం 18 బ్యాంకులు ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌లో భాగంగా ఉంటాయి, ”అని కేంద్రమంత్రి చెప్పారు.