ఆనంద్ మహీంద్రా మంగళవారం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ 'ఐటీ సహా ఏ ఇతర వ్యాపార సంబంధ అంశాలు చర్చించలేదట. సొసైటీపై ప్రభావం చూపేందుకు ఎలా కలిసి వర్క్ చేయాలనే అంశంపైనే మాట్లాడారని ఆనంద్‌ మహేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా గేట్స్ ఆటోగ్రాఫ్, ఓ పుస్తకాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు.


“బిల్ గేట్స్‌ను మళ్లీ చూడడం ఆనందంగా ఉంది. రిఫ్రెష్‌గా అనిపించింది. మా మధ్య ఐ టీ లేదా వేరే ఇతర వ్యాపారం గురించి డిస్కషన్ జరగలేదు. సామాజికంగా ప్రభావం చూపే అంశంలో మేము ఎలా కలిసి పని చేయవచ్చు అనే దాని గురించి చర్చించాం. (నేను గేట్స్‌ చేతుల మీదుగా ఓ పుస్తకగాన్ని ఆటోగ్రాఫ్‌ను పొందాను)" అని మహీంద్రా ట్విట్టర్‌లో రాశారు.






మహీంద్రా ఈ రెండు చిత్రాలను కూడా పోస్ట్ చేశారు. వాటిలో ఒకటి గేట్స్ తన పుస్తకం ‘ది రోడ్ ఎహెడ్’పై చేతితో రాసిన నోట్‌ ఉంది. అందులో ఇలా ఉంది, “నా క్లాస్‌మేట్‌ ఆనంద్‌కు శుభాకాంక్షలు. బిల్ గేట్స్." అని ఉంది. 


ఈ ట్విట్స్‌ చూసాక చాలా మంది ట్విటర్ వినయోగదారులు చాలా ఆసక్తికరమైన రిప్లైలు ఇచ్చారు. ఈ ఇద్దరు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో క్లాస్‌మేట్స్ అని ఒక నెటిజన్ చెప్పాడు. మరికొందుర అవునా అంటూ ఆశ్చర్యపోతూ రిప్లై ఇచ్చారు. మరొక నెటిజన్ ఇలా రాశాడు... “వావ్! ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు నిజమైన హీరోలు!’’ అని మరొకరు ‘‘సమాజాన్ని మొత్తంగా మార్చే ప్రయత్నంలో రెండు రత్నాలు’’ అని కామెంట్ చేశారు. 


మంగళవారం బిల్‌గేట్స్‌ ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌ను కూడా కలిశారు. "ఫైనాన్షియల్ ఇంక్లూజన్, పేమెంట్ సిస్టమ్స్, మైక్రోఫైనాన్స్, డిజిటల్ లెండింగ్ మొదలైన వాటిపై బిల్‌గేట్స్‌తో చాలా మంచి సమావేశం జరిగింది" అని సమావేశం తర్వాత దాస్ ట్వీట్ చేశారు.