Netaji Subhash Chandra Bose 125th Birth Anniversary: భారత దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భిన్నమైన వ్యక్తి, గొప్ప స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇతర వీరులకు, నేతలకు వర్ధంతులు ఉన్నాయి కానీ కేవలం జయంతి మాత్రమే ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి నేడు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని జనవరి 23న పరాక్రమ దినోత్సవం (Parakram Diwas) ఘనంగా జరుపుకుంటున్నాం.
దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు, సీఎంలు నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. నేతాజీ జయంతిని పురష్కరించుకుని నేటి సాయంత్రం 6 గంటలకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారు.
కిరణ్ రిజిజు నివాళి..
‘భారతదేశపు ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ వందనం తెలియజేస్తున్నాను. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ చేసిన కృషికి దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని’ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ జరుపుకోవడం స్వాతంత్ర్య సమరయోధుడి పట్ల మనకున్న గౌరవాన్ని తెలియజేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తన జీవితాన్ని దేశం కోసం, స్వాతంత్య్రం కోసం అంకితం చేసిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ అని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ పోస్ట్ చేశారు.
Also Read: Subhas Chandra Bose Jayanti 2022: 125వ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ అరుదైన చిత్రాలు చూద్దాం...