Naval Anti-ship Missile: నౌకా విధ్వంసక క్షిపణి (యాంటీ షిప్ మిసైల్) ప్రయోగాన్ని బుధవారం విజయవంతంగా చేపట్టింది భారత నావికాదళం. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో(ఐటీఆర్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. భారత నౌకాదళం, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)తో కలిసి ఈ పరీక్షను నిర్వహించింది.
మొట్టమొదటి
దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణి ఇదే కావడం విశేషం. ఈ క్షిపణి తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను ట్విట్టర్‌లో భారత నావికాదళం షేర్ చేసింది.
మరింత బలోపేతం
రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరి మంగళవారం జలప్రవేశం చేశాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయగిరి, సూరత్ ఆవిష్కరణతో భారత్ నౌకా నిర్మాణంలో కొత్త అధ్యాయం మొదలైనట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ప్రపంచ దేశాలకు అవసరమైన నౌకలను నిర్మించే సత్తా మనకు ఉందన్నారు. మేకిన్ ఇండియా మాత్రమే కాదు, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Also Read: Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్