షహబుద్దీన్ అహ్మద్ అనే వ్యక్తి దీపమణి కలిత అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. ఆయన కామరూప్ రూరల్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో పని చేసేవారు. అయితే అనుకోకుండా ఆయన మరణించాడు. 2017లో రోడ్డు ప్రమాదంలో అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. తన భర్త చనపోయిన తర్వాత.. పింఛను, మిగిలిన ప్రయోజనాలు.. తనకు మంజూరు కావాలని.. దీపమణి ఆఫీసుల చుట్టూ తిరిగింది.  ఇక చేసేది ఏమీ లేక కోర్టు మెట్లు ఎక్కింది. తనకు మంజూరు చేయాలంటూ.. గౌహతి కోర్టులో పిటిషన్ వేసింది. దీపమణికి 12 సంవత్సరాల కొడుకు  ఉన్నాడు. 


ప్రత్యేక వివాహ చట్టం, 1954లోని సెక్షన్ 4ను గురించి హైకోర్టు ప్రస్తావించింది. ప్రత్యేక వివాహం చేసుకోవడానికి సంబంధించిన షరతుల్లో ఒకటి గుర్తుంచుకోవాలని హైకోర్టు చెప్పింది. రెండో వివాహం చేసుకునే వారికి.. ఇరువురిలో భార్య లేదా భర్త ఉండకూడదని తెలిపింది. షహబుద్దీన్ అహ్మద్ చేసుకున్న పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించేనాటికి ఆయనకు ఓ భార్య సజీవంగా ఉందనే విషయంలో వివాదం లేదని తెలిపింది. మొదటి భార్యతో ఆయన వివాహం రద్దయినట్లు తెలిపే డాక్యుమెంట్ ఏదీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది.


ఎండీ సలీం అలీ వర్సెస్ షంషుద్దీన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. పిటిషనర్ సంప్రదాయ మహమ్మదీయ చట్టం ప్రకారం వివాహం చేసుకోలేదు కానీ ఆమె ప్రత్యేక వివాహ చట్టం, 1954 కింద వివాహం చేసుకుందని తెలిపింది.  ఆ చట్టంలోని సెక్షన్ 4 (ఎ) లోని నిబంధనలే వివాహాన్ని రద్దు చేస్తాయని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్ ఇప్పటికీ తన హిందూ పేరును ఉపయోగిస్తున్నారని... పిటిషనర్ ఇస్లాం మతాన్ని తన విశ్వాసంగా అంగీకరించినట్లు చూపించడానికి రికార్డులో ఏమీ లేదని హైకోర్టు చెప్పింది. 


రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ, ఆమె కుమారుడికి పింఛను, ఇతర ప్రయోజనాల్లో వాటా పొందే హక్కు ఉందని హైకోర్టు తెలిపింది. ఆ బాలుడి పేరు మీద బ్యాంకు ఖాతాను పిటిషనర్ తెరవవచ్చునని సూచించింది.


 


Also Read: Telangana Nirbhaya : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?


Also Read: Flipkart Big Billion Days: త్వ‌ర‌లో ప్రారంభం .. ఏకంగా 90 శాతం వ‌రకు త‌గ్గింపు.. ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన కంపెనీ!


Also Read: Telangana: కనీసం నిలబడలేకపోతున్నాడని చెప్పారు, పోలీసులపై ఎదురుకాల్పులు ఎలా జరుపుతాడు, నా భర్తను పోలీసులే హత్య చేశారన్న చెన్నకేశవులు భార్య రేణుక