Manipur Violence: 


మిలిటెంట్స్‌ని రిలీజ్ చేయాలని డిమాండ్..


మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన 12 మంది మిలిటెంట్స్‌ని అరెస్ట్ చేసింది ఆర్మీ. వాళ్లను విడుదల చేయాలంటూ నిరసనకారులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇథామ్‌ గ్రామంలో ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీని 12 వందల మంది చుట్టుముట్టారు. అరెస్ట్ చేసిన 12 మంది మిలిటెంట్స్‌ని విడుదల చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. మహిళల నేతృత్వంలో వందలాది మంది చుట్టుముట్టడం వల్ల ఆర్మీ ఏమీ చేయలేకపోయింది. పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడం ఎందుకని ఆలోచించి ఆ 12 మందిని విడుదల చేసింది. వాళ్లను విడుదల చేస్తేనే ఎంతో కొంత ఆందోళనలు తగ్గుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 


"మహిళలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. వాళ్లపై మా ఫోర్స్‌ని వాడే విషయంలో చాలా ఆలోచించాం. ఒకవేళ మేం యాక్షన్‌ తీసుకున్నా చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఇది ముందుగా ఆలోచించే...వాళ్లు డిమాండ్ చేసినట్టుగా 12 మంది మిలిటెంట్స్‌ని విడుదల చేశాం. కమాండర్ తీసుకున్న నిర్ణయం మంచిదనే భావిస్తున్నాం. ఇండియన్ ఆర్మీ మానవతా దృక్పథానికి ఇది నిదర్శనం"


- ఇండియన్ ఆర్మీ






అరెస్టైన మరుసటి రోజే విడుదల..


Kanglei Yawol Kanna Lup (KYKL) గ్రూప్‌కి చెందిన మితేయ్ మిలిటెంట్స్‌ని అరెస్ట్ చేసింది ఆర్మీ. చాలా రోజులుగా స్థానికంగా దాడులను ప్రేరేపిస్తున్నారు ఈ ఉగ్రవాదులు. వీళ్లను అదుపులోకి తీసుకున్న తరవాత పరిస్థితులు నార్మల్ అవుతాయని భావించారు. కానీ...ఉన్నట్టుండి అంత మంది వచ్చి చుట్టుముట్టే సరికి అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే విడుదల చేయాల్సి వచ్చింది.