ఒడిశా రైలు ప్రమాదం మర్చిపోక ముందే పశ్చిమబెంగాల్‌లో మరో ఘోరం జరిగింది. బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఓండా స్టేషన్‌కు దగ్గర్లో రెండు గూడ్స్‌ రైళ్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో రెండు రైళ్లకు చెందిన బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు ఓ గూడ్స్‌ రైలు ఇంజిన్‌ మరో కోచ్ పైకి ఎక్కింది. ఆగి ఉన్న ఒక గూడ్స్ రైలును, ఇంకో రైలు వెనక నుంచి ఢీకొంది.






ఆదివారం (జూన్ 25) తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమ బంగాల్ లోని బంకూర జిల్లాలోని ఓండా అనే స్టేషన్‌ వద్ద లూప్‌లైన్‌లో ఒక గూడ్స్ రైలు ఆగి ఉంది. ఈ ఆగి ఉన్న గూడ్స్‌ రైలును మరో గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టిందని జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. వేగంగా గూడ్స్ రైలు ఢీకొనడం వల్ల రైలు ఇంజిన్‌, బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దాదాపు 12 బోగీల దాకా పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక రైలు లోకోపైలట్‌కు బాగా గాయాలు అయినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ రైలు ప్రమాదం వల్ల ఆ మార్గంలో నడిచే రైళ్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.