Mamata Banerjee Car Attack: టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారుపై బారక్‌పూర్‌లో రాళ్లదాడి జరిగింది. దాంతో ఆమె భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. టీఎంసీ కార్యకర్త ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ దాడిపై మమతా బెనర్జీ మాట్లాడుతూ, కారు కిటికీ తెరిచి ఉంటే తన తల పగిలిపోయేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాళ్లదాడి తర్వాత మమతా బెనర్జీ ఉపయోగిస్తున్న కారు, దాని భద్రతపై చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ మమతా బెనర్జీ వద్ద ఏ కారు ఉంది, అది ఎంతమేరకు సురక్షితం అనేది తెలుసుకుందాం.
మమతా బెనర్జీ కారు, వ్యక్తిగత వాహనం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు అందించినప్పటికీ మమతా బెనర్జీ పేరుమీద ఎలాంటి వ్యక్తిగత వాహనం రిజిస్టర్ కాలేదు. కోల్‌కతా నగరంలో రోజువారీ పనుల కోసం ఆమె తన పార్టీకి చెందిన ఒక సహచరుడు ఇచ్చిన పాత హ్యుందాయ్ సాంట్రో (Hyundai Santro) కారును ఉపయోగిస్తున్నారు. కోల్‌కతా బయట సుదూర పర్యటనలకు వెళ్లాల్సినప్పుడు ఆమె మహీంద్రా స్కార్పియో లేదా ఇతర ఎస్‌యూవీలను ఉపయోగిస్తారని తెలిసిందే. బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ ప్రభుత్వ ఖర్చుతో లభించే ఖరీదైన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో తాను ప్రయాణించనని ఆమె పేర్కొన్నారు.
క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ సాంట్రో సేఫ్టీ ఎలా ఉంది?
బారక్‌పూర్‌లో రాళ్లతో జరిగిన దాడి తర్వాత మమతా బెనర్జీ హ్యుందాయ్ సాంట్రో ఇచ్చే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు 5లో కేవలం 2 స్టార్ భద్రతా రేటింగ్ మాత్రమే పొందింది. నివేదికలో కారు నిర్మాణం అంటే బాడీ షెల్, కాళ్ల దగ్గర భాగం సాధారణంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం లేదా పెద్ద దాడి పరిస్థితిలో ఈ కారు ఎక్కువ భద్రత ఇవ్వలేదు. టెస్టుల సమయంలో డ్రైవర్ ఛాతీ, మోకాళ్ల రక్షణ కూడా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు.
మమతా బెనర్జీకి ఏ భద్రత కల్పిస్తున్నారు
మమతా బెనర్జీకి అధికారికంగా దేశంలో రెండో అత్యున్నత జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత ఇస్తున్నారు. ఇది యెల్లో బుక్ ప్రోటోకాల్ కింద ఇస్తారు. ఇందులో భాగంగా మొత్తం 55 లేదా అంతకంటే ఎక్కువ సాయుధ కమాండోలు, భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారు.
- భద్రతలో మొదటి, అంటే ఇన్నర్ రింగ్ వలయాన్ని అత్యంత శిక్షణ పొందిన NSG లేదా ఎస్‌పీజీ స్థాయి కమాండోలు నిర్వహిస్తారు.
- సెక్యూరిటీ మధ్య వలయంలో కార్యకలాపాలను గమనించే సపోర్ట్ సిబ్బంది ఉంటారు.
- ఔటర్ రింగ్.. మూడో వలయంలో CRPF, సీఐఎస్ఎఫ్ లేదా స్థానిక పోలీసు సిబ్బంది రాకపోకలు, చుట్టుపక్కల గుంపును కంట్రోల్ చేస్తారు.
Also Read: Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
మాజీ సీఎం కాన్వాయ్, నివాస భద్రత
జెడ్-ప్లస్ ప్రోటోకాల్ కింద వీఐపీ కాన్వాయ్‌లో ముందు వెనుక ఎస్కార్ట్ వాహనాలు, పైలట్ వాహనం, బుల్లెట్‌ప్రూఫ్ కారు, అంబులెన్స్ కూడా ఉంటాయి. అలాగే నివాసం, కార్యాలయంలో 24 గంటలూ గార్డులు అప్రమత్తంగా ఉంటారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం మారిన తర్వాత మమతా బెనర్జీ నివాసం బయట నుంచి కొన్ని అదనపు బారికేడ్లు తొలగించారు. పాత వ్యక్తిగత భద్రతా అధికారులను మార్చిన వివాదం కారణంగా ఆమె కొత్త ప్రభుత్వ భద్రతా సిబ్బంది సేవలను నిరాకరించారు.
ఇల్లు, భూమి లేని ముఖ్యమంత్రి
ఇతర ప్రముఖ రాజకీయ నాయకులకంటే భిన్నంగా మమతా బెనర్జీ ప్రొఫైల్ ఉంది. ఆమె వద్ద ఎలాంటి స్థిరాస్తి లేదు. ఆమెకు ఇల్లు లేదు, కమర్షియల్ భవనం లేదు, వ్యవసాయ భూమి కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రోజువారీ అవసరాల కోసం ఆమె వద్ద 75,700 నగదు ఉంది, ఇది 2021లోని 69,255 రూపాయల కంటే కొంచెం ఎక్కువ. అఫిడవిట్‌లో ఆమెపై ఎలాంటి లోన్ లేదా అప్పులను ప్రకటించలేదు. వ్యక్తిగత ఇల్లు, స్వంత కారు లేకుండా దేశంలో అతి తక్కువ ఆస్తి ఉన్న ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.
Also Read: Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
