Maruti Victoris S-CNG Price And Features Telugu: తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవాళ్లకు CNG కార్లు మంచి ఎంపిక. అలాంటి కార్ల జాబితాలో మారుతి విక్టోరిస్‌ S-CNG కూడా ఉంది. వాస్తవానికి, Maruti Suzuki Victorisలో పెట్రోల్, CNG, బలమైన హైబ్రిడ్ వంటి పలు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్‌కు మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. ఆల్-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ వేరియంట్ కూడా ఉంది. అయితే Victoris కొనేవాళ్లలో, దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు (దాదాపు సగం మంది) CNG వేరియంట్‌నే ఎంచుకుంటున్నారు. ఈ ఆదరణకు కారణమేంటో తెలుసుకునేందుకు, ఆటో ఎక్స్‌పర్ట్‌లు CNG వెర్షన్‌ను స్వయంగా నడిపి పరీక్షించారు.

Continues below advertisement

ఇంజిన్ Victoris CNGలో 1.5 లీటర్ నాలుగు సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. CNGపై ఇది 88hp శక్తిని & 122Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా చూస్తే ఈ సంఖ్యలు పెద్దగా అనిపించకపోయినా, రోడ్డుపై ఈ కారు పనితీరు మాత్రం బాగుంది.

సిటీ ట్రాఫిక్‌లో ఈ కారు సులభంగా ముందుకు సాగుతుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగం వరకు ఇంజిన్ 3,000 ఆర్‌పీఎమ్‌ కంటే తక్కువ వేగంతో పనిచేస్తుంది. దీంతో సాధారణ ప్రయాణాలకు అవసరమైన శక్తి అందుబాటులో ఉంటుంది. అయితే వేగంగా ఓవర్‌టేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంజిన్‌ను కొంచెం ఎక్కువగా కష్టపెట్టాల్సి ఉంటుంది.

Continues below advertisement

దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది, గేర్ మార్పులు చాలా స్మూత్‌గా ఉన్నాయి. క్లచ్ కూడా తేలికగా ఉంటుంది. దీంతో నగరంలో రోజువారీ డ్రైవింగ్ పెద్దగా అలసట కలిగించదు.

ఇది కూడా చదవండి: BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!

స్పీడ్‌Victoris CNG వెర్షన్ 0-20 కిలోమీటర్ల వేగాన్ని 1.33 సెకన్లలో అందుకుంది. 40 కిలోమీటర్ల వేగానికి 3.28 సెకన్లు పట్టింది. 60 కిలోమీటర్ల వేగానికి 6.31 సెకన్లు, 80 కిలోమీటర్ల వేగానికి 9.88 సెకన్లు తీసుకుంది. 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 15.14 సెకన్లు పట్టింది. పెట్రోల్ వెర్షన్ మాత్రం 13.43 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

అంటే CNG వెర్షన్ పెట్రోల్ కంటే 1.7 సెకన్లు నెమ్మదిగా 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. 100 కిలోమీటర్ల వేగం దాటిన తర్వాత రెండు వెర్షన్లలోనూ వేగం పెరుగుదల కొంత తగ్గుతుంది.

మైలేజీVictoris S-CNG అసలు బలం ఇదే. పరీక్షల్లో, నగరంలో కిలోకు 18 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చింది. హైవేపై 26 కిలోమీటర్లు ప్రయాణించింది. కంపెనీ ప్రకటించిన 27.02 కిలోమీటర్లు/కిలో మైలేజీకి ఈ ఫలితం చాలా దగ్గరగా ఉంది.

CNG ట్యాంక్‌ను బూట్ ఫ్లోర్ కింద అమర్చారు. దీని సామర్థ్యం 55 లీటర్లు. వాతావరణ పరిస్థితులు & పంప్ ప్రెజర్ ఆధారంగా ఇందులో సాధారణంగా 7.4 నుంచి 8 కిలోల వరకు CNG నింపవచ్చు. ఫుల్‌ ట్యాంక్‌తో, వాస్తవ పరిస్థితుల్లో సుమారు 200 కిలోమీటర్ల పైగా (8 కిలోలు x 26 కి.మీ.) వరకు ప్రయాణించవచ్చు.

ఇది కూడా చదవండి: Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో

రైడ్ నాణ్యత కూడా ఆకట్టుకుంటుంది. చిన్న గుంతలు, రోడ్డు ఎత్తుపల్లాలను సస్పెన్షన్ సులభంగా దాటేస్తుంది. గతుకుల రోడ్డులోనూ క్యాబిన్‌లోకి ఎక్కువ కుదుపులు రాకుండా చూస్తుంది. ఎక్కువ వేగంతో వెళ్లినప్పుడు కూడా కారు స్థిరంగా ఉంటుంది, అనవసర బాడీ కదలికలు తక్కువగా ఉంటాయి.

భద్రత ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ABSతో EBD వంటి ఫీచర్లు ప్రామాణికంగా ఉన్నాయి. ఎంట్రీ లెవల్ LXI వేరియంట్ కూడా మంచి విలువను అందిస్తుంది. దీని ధర రూ.11.50 లక్షలు. ఇందులో కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto & Apple CarPlay, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

బూట్ స్పేస్ విషయంలోనూ CNG వెర్షన్‌ను బాగా రూపొందించారు. CNG ట్యాంక్‌ను బూట్ కింద అమర్చడంతో పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే లగేజీ స్థలం పెద్దగా తగ్గదు. అయితే ఒక ముఖ్యమైన లోటు ఉంది. స్పేర్ టైర్ ఇవ్వలేదు, దాని బదులు టైర్ ఇన్‌ఫ్లేటర్ కిట్ మాత్రమే ఉంటుంది.

మొత్తంగా చూస్తే Maruti Victoris S-CNG ఒక తెలివైన ఎంపికగా కనిపిస్తుంది. నగరంలో మంచి డ్రైవింగ్ అనుభూతి, అద్భుతమైన మైలేజీ, ఉపయోగకరమైన బూట్ స్పేస్ & మంచి ఫీచర్లు దీని బలాలు. పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే సుమారు రూ.1 లక్ష ఎక్కువ చెల్లించాల్సి వచ్చినా, తక్కువ ఇంధన ఖర్చు కారణంగా ఆ అదనపు మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.