Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి భాజపానే కారణమని శివసేన ఆరోపిస్తోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు అసోంలోని గువాహటిలో భాజపా ఆతిథ్యం కల్పిస్తోందని శివసేన మండిపడింది. అయితే ఈ ఆరోపణలకు అసోం సీఎం కౌంటర్ ఇచ్చారు. అసోం రాష్ట్రానికి రాకుండా ఏ ఒక్కరినీ తాను ఆపనని, ఉద్ధవ్ ఠాక్రే కూడా రావచ్చన్నారు.
గువాహటిలో మకాం
అసోం రాజధాని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్నారు. ఇందుకు సంబంధించి.. రెబల్ క్యాంపు నుంచి వీడియోలు బయటకు వచ్చాయి.
ఈ ఫైవ్ స్టార్ హోటల్లో 7 రోజులకు గాను 70 రూమ్‌లను బుక్ చేసినట్లు తెలిసింది. 7 రోజులకు వీటి ఖర్చు రూ. 56 లక్షలు కాగా, వీటికి అదనంగా ఆహారం, ఇతర సేవలన్నీ కలుపుకొని ఒక్క రోజుకు రూ.8 లక్షల చొప్పున ఖర్చు అవుతుందని సమాచారం.
రాడిసన్ బ్లూ హోటల్లో మొత్తం 196 గదులు ఉన్నాయని తెలిసింది. రెబల్ ఎమ్మెల్యేల కోసం బుక్ చేసిన 70 గదులు పోగా.. ఇంతకుముందే బుక్ అయిన రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే, వీటిని మినహాయించి కొత్తగా రూమ్ బుకింగ్ సౌకర్యాన్ని యాజమాన్యం నిలిపివేసినట్లు సమాచారం.
హోటల్ ఖర్చులే కాకుండా ఎమ్మెల్యేలు అంతా ఛార్టెడ్ విమానంలో ఇక్కడికి వచ్చారని మొన్న వార్తలు వచ్చాయి. మరి వీరి ట్రాన్స్‌ఫోర్ట్‌కు ఏ మేరకు ఖర్చు అయ్యిందో ఊహించుకోవచ్చు. అలాగే ఈ ఖర్చంతా ఎవరు భరిస్తున్నారు అనే దానిపై కూడా స్పష్టత లేదు.
Also Read: Viral News: భార్యను కాటేసిన పాము- సీసాలో పెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త!
Also Read: Gleycy Correia Passes Way: టాన్సిల్స్ తీస్తే చనిపోతారా? పాపం, మాజీ మిస్ బ్రెజిల్‌కు ఏమైంది?