Maharashtra Political Crisis: మహా రాజకీయంలో మరో ట్విస్ట్- కూటమికి బైబై చెప్పేందుకు శివసేన రెడీ!
Maharashtra Political Crisis: తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబయికి వస్తే కూటమి నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని శివసేన ప్రకటించింది.
Continues below advertisement

(Image Courtesy: Getty)
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయం మరో ట్విస్ట్ అందుకుంది. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శివసేన ప్రకటించింది అయితే 24 గంటల్లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబయి చేరుకోవాలని అల్టిమేటం ఇచ్చింది. అప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
Continues below advertisement
రెబల్ ఎమ్మెల్యేలు గువాహటి నుంచి మాట్లాడటం కాదు. ముంబయికి తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలి. 24 గంటల్లో ఎమ్మెల్యేలంతా ముంబయికి రావాలి. అప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు. బలపరీక్ష జరిగినప్పుడు అందరూ చూస్తారు. విశ్వాస పరీక్ష వరకూ వస్తే అధికార కూటమి మహా వికాస్ అఘాడీ గెలుస్తుంది. శివసేనకు ద్రోహం చేయాలనుకునేవారు బాల్ ఠాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరు. - సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
టచ్‌లో ఉన్నారు
రెబల్ ఎమ్మెల్యేలలో 21 మంది తమతో టచ్‌లో ఉన్నారని సంజయ్ రౌత్ అన్నారు. వాళ్లంతా ముంబై చేరుకున్నాక ప్రస్తుత గందరగోళ పరిస్థితులు చక్కబడతాయన్నారు.
మరోవైపు మొత్తం 42 మంది ఎమ్మెల్యేలతో వీడియో విడుదల చేశారు రెబల్ గ్రూప్ నేత ఏక్‌నాథ్ షిండే. 42 మందిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు.
Continues below advertisement