Kerala Rare Brain Disease:
బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్..
కేరళలో ఓ బాలుడు అరుదైన వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. కలుషిత నీళ్లు తాగడం వల్ల బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ అయ్యి మృతి చెందాడు. అలప్పుజ జిల్లాలో ఓ బాలుడిలో ఇది గుర్తించినట్టు వైద్యులు వెల్లడించారు. కలుషిత నీళ్లలో ఉండే ఓ అమీబా 15 ఏళ్ల బాలుడి బ్రెయిన్‌ని ఇన్‌ఫెక్ట్ చేసిందని వివరించారు. ఈ వ్యాధిని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్‌గా (primary amoebic meningoencephalitis) నిర్ధరించారు. బాలుడి మృతిపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్..ఇప్పటి వరకూ ఐదుగురిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయని తెలిపారు. 2016లో అలప్పుజలో తొలి కేసు నమోదైంది. ఆ తరవాత 2019,20 లోనూ మలప్పురంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. 2020,2022లో కజికోడ్, త్రిస్సూర్‌లో కేసులు నమోదయ్యాయి. జ్వరం, తలనొప్పి, వాంతులు, ఫిట్స్...ఇవీ ఈ వ్యాధి లక్షణాలు. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే..ఈ ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు బతికే అవకాశాలు అసలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న నీళ్లలో ఈ అమీబా పెరుగుతుందని, ఇది ముక్కు ద్వారా శరీరంలోకి చేరుతుందని వివరించారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రజలెవ్వరూ కలుషిత నీళ్లతో స్నానం చేయొద్దని సూచించారు.
Also Read: భారత్‌ని భయపెడుతున్న ఎల్‌నినో, కరవు ముప్పు తప్పదేమో!