Karnataka News: తప్పు చేస్తే ఎప్పటికైనా పట్టుబడాల్సిందే. కొద్దిగా ముందూ వెనకా తప్పకుండా చట్టానికి దొరికిపోతారు. ఇది చాలా కేసుల్లో నిజమైంది. కొన్ని సార్లు సంవత్సరాల తరబడి తప్పించుకు తిరిగిన వారు కూడా చివరికి పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైన ఘటనలు చాలానే ఉన్నాయి. కర్ణాటకలోని ఓ వ్యక్తి నేరాలకి పాల్పడ్డాడు. చాకచక్యంగా ఆ నేరం నుంచి తప్పించుకోగలను అనుకున్నాడు. ఒక ప్లాన్ కూడా వేశాడు. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో చివరికి పోలీసులకు పట్టబడాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..


కర్ణాటకలోని మంగళూరు సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ములిహిత్లు ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. తౌసిఫ్ హుస్సేన్ అనే వ్యక్తి ములిహిత్లు ప్రాంతంలో ఓ కిరాణ దుకాణం నడిపిస్తున్నాడు. అతని వద్ద గజ్నాన అనే వ్యక్తి కూలీగా పని చేస్తున్నాడు. ఓ చిన్న విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్త పెరిగి పెద్దదైంది. కోపంతో రగిలిపోయిన తౌసిఫ్ హుస్సేన్.. గజ్నానకు నిప్పంటించాడు. మంటలకు శరీరం కాలిపోవడంతో గజ్నాన తీవ్రంగా కేకలు వేస్తూ తల్లడిల్లిపోయాడు. స్థానికులు ఆ అరుపులు విని అక్కడికి రావడంతో తౌసిఫ్ హుస్సేన్ అప్పటికప్పుడు ఓ పథకం పన్నాడు. గజ్నాన విద్యుదాఘాతానికి గురయ్యాడని, కరెంట్ షాకుతో తన శరీరం చాలా వరకు కాలిపోయిందని చెప్పి స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. గజ్నానను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అంతలోపే గజ్నాన ప్రాణాలు వదిలాడు. ఆ కూలీ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికులను, గజ్నాన చనిపోయిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసుల విచారణలో గజ్నానది హత్యగా నిర్ధారించారు పోలీసులు. తౌసిఫ్ హుస్సేనే గజ్నాను చంపాడని నిర్ధారించి అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 


Also Read: వైర్లతో కాళ్లు చేతులు కట్టేసి, యువతిని సజీవంగా పాతిపెట్టిన యువకుడు


మెక్సికోలో భార్యను చంపి మెదడు తినేసిన భర్త


మెక్సికోలో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె మెదడుని బయటకు తీసి తినేశాడు. మెక్సికన్ ఫుడ్‌ Tacosలో ఆమె మెదడుని పెట్టి తిన్నాడు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు అల్వారో ఓ బిల్డర్. జూన్ 29వ తేదీన డ్రగ్స్ తీసుకున్నాడు. అక్కడ నిషేధం ఉన్నా అక్రమంగా తెచ్చుకున్నాడు. ఆ మత్తులోనే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే.."మృత్యుదేవత నాతో మాట్లాడింది. ఆమెని చంపాలని చెప్పింది" అని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ఏడాది క్రితమే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమెకి అప్పటికే ఐదుగురు పిల్లలున్నారు. అయితే..తన భార్యని హత్య చేసిన తరవాత మెదడు బయటకు తీసి తిన్నానని పోలీసుల ముంద అంగీకరించాడు నిందితుడు. అంతేకాదు. ఆమె పుర్రెని యాష్‌ట్రేగా వాడుకున్నాడు. ఆ తరవాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టాడు. రెండ్రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉన్న నిందితుడు ఆ తరవాత కూతురికి ఫోన్ చేసి మర్డర్ చేసినట్టు ఒప్పుకున్నాడు. "నేను మీ అమ్మని చంపేసి బ్యాగ్‌లో పెట్టాను. వచ్చి డెడ్‌బాడీని కలెక్ట్ చేసుకో" అని చెప్పాడు. సుత్తితో బలంగా కొట్టి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ హైడోస్ తీసుకోవడం వల్ల కంట్రోల్ కోల్పోయాడని, బహుశా మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్టుందని వివరించారు. ఆమె కూతుళ్లనూ చాలా సార్లు లైంగికంగా వేధించినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial