Delhi Cash At Home Row: ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం, జస్టిస్‌ యశ్వంత్‌వర్మపై వేటు

Continues below advertisement

Delhi High Court judge Yashwant Varma | న్యూఢిల్లీ: జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్‌ యశ్వంత్‌వర్మపై ఢిల్లీ హైకోర్టు వేటు వేసింది. యశ్వంత్‌వర్మను విధుల నుంచి తప్పిస్తున్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోయినట్లు గుర్తించారు. ఆరోపణలు రాగానే అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేయడం తెలిసిందే. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తన ఇంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయో తనకు తెలియదని బుకాయించే ప్రయత్నం చేయడంతో మరింత ముదిరింది. ఆయన ఇంట్లో ఫైర్ సిబ్బంది గుర్తించిన నోట్ల కట్టల వీడియోలను విడుదల చేయడంతో వివాదంపై మరింత క్లారిటీ వచ్చింది. ఆయన తప్పు చేశారని, అందుకే ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Continues below advertisement
Sponsored Links by Taboola