PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రమూకలు దాడి చేశాయి. 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నాయి. ఇందులో పాకిస్థాన్ హస్తం ఉందని స్పష్టమైంది. కేంద్రం కూడా పాకిస్థాన్‌పై కఠిన మైన చర్యలు తీసుకుంది. మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రజలంతా ఐక్యంగా ఉంటూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉండాలని మోదీ పిలుపునివ్వబోతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి దేశంలో విధ్వంసం సృష్టించాలనే ఉగ్రవాదుల పన్నాగానికి ఊతమిచ్చే కార్యక్రమాలు చేయొద్దని పిలుపునివ్వనున్నారు. ఈ దాడితో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.