Vignesh Puthur: ఆటోడ్రైవ‌ర్ కొడుకు నుంచి ఐపీఎల్ డెబ్యూ వ‌ర‌కు.. పేస‌ర్ నుంచి లెగ్ స్పిన్న‌ర్ గా పుతుర్ ప్ర‌స్థానం.. చెన్నైపై స‌త్తా చాటిన ముంబై బౌల‌ర్

సాధార‌ణ పేద కుటుంబం నుంచి వ‌చ్చి, స్టార్ గాఎదిగిందుకు ఐపీఎల్ వేదిక‌గా మారింది. కేర‌ళైట్ విఘ్నేశ్ పుతుర్ నేప‌థ్యం చాలా ఆస‌క్తిక‌రం. తనదో సాదాసీదా కుటుంబం . అక్కడి నుంచి ఐపీఎల్ వరకు తన ప్రస్థానం...

Continues below advertisement

IPL 2025 CSK VS MI  Update: ఐపీఎల్ 2025 లో డెబ్యూ మ్యాచ్ లోనే ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ‌కు చెందిన విఘ్నేశ్ పుతుర్. చెపాక్ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ పై నాలుగు వికెట్ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. ఓ ద‌శ‌లో సునాయ‌సంగా గెలుస్తుంద‌న‌కున్న చెన్నైని త‌న స్పిన్ మ్యాజిక్ తో క‌ట్టి ప‌డేశాడు పుతుర్. తన స్పిన్ మ్యాజిక్ తో మూడు కీల‌క‌మైన వికెట్లు తీయ‌డంతో ఒక ద‌శ‌లో చెన్నై ఓట‌మి దిశ‌గా సాగింది. ముఖ్యంగా అప్ప‌టికే భీక‌రంగా ఆడుతున్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ని త‌న తొలి ఓవ‌ర్ లోనే పుతుర్ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత శివ‌మ్ దూబే, దీప‌క్ హుడాల‌ను పెవిలియ‌న్  కు పంపి, మ్యాచ్ లో ముంబై తిరిగి పుంజుకునేలా చేశాడు. అయితే చివ‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా స‌హ‌కారంతో ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర కంఫ‌ర్ట‌బుల్ గా జ‌ట్టును విజ‌య ప‌థంలోకి నడిపించాడు. గ‌తేడాది మెగావేలంలో కేవ‌లం రూ.30 ల‌క్ష‌ల‌కు ముంబై, పుతుర్ ను కొనుగోలు చేసింది. అత‌ని నేప‌థ్యం చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. 

Continues below advertisement

ఆటో డ్రైవ‌ర్ కొడుకు..
ఐపీఎల్ ఎంతో మంది వ‌ర్థమాన క్రికెట‌ర్ల జీవితాల‌ను మార్చిన సంగ‌తి తెలిసిందే. పేద‌రికం నుంచి కోటీశ్వ‌రులుగా ఎంతో మంది క్రికెట‌ర్ల‌ను తీర్చిదిద్దింది. ఆటో డ్రైవ‌ర్ కొడుకైన మ‌న హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్.. ఐపీఎల్ పుణ్య‌మా అని త‌ను ఇప్పుడు టీమిండియాలో రెగ్యుల‌ర్ పేస‌ర్ గా మారాడు. ఇక అలాంటి కోవ‌లోకే వ‌స్తాడు పుతుర్. కేర‌ళలోని మ‌ల‌ప్పురంకు చెందిన ఆటో డ్రైవ‌ర్ కొడుకు పుత‌ర్ కావ‌డం విశేషం. అత‌ని త‌ల్లి సాధార‌ణ గృహిణి. 24  ఏళ్ల పుతుర్.. కేర‌ళ సీనియ‌ర్ జ‌ట్టుకు ఆడ‌కుండానే ఏకంగా ఐపీఎల్ లోకి ప్ర‌వేశించాడు. అయితే గ‌తంలో త‌ను అండ‌ర్-14, అండ‌ర్-19 లెవ‌ల్లో రాష్ట్ర జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఇక ప్ర‌స్తుతం కేర‌ళ క్రికెట్ లీగ్ లోని అలెప్పీ రిపుల్స్ త‌ర‌పున ఆడుతున్నాడు. అలాగే గ‌తంలో త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్ లోనూ ప్రాతినిథ్యం వ‌హించాడు. 

పేస‌ర్ నుంచి స్పిన్న‌ర్ గా..
పుతుర్ స్పిన్న‌ర్ గా మార‌డం వెన‌క చిత్ర‌మైన కార‌ణం ఉంది. ఫ‌స్ట్  త‌ను మీడియం పేస‌ర్ గా బౌలింగ్ వేసేవాడు. అయితే స్థానిక క్రికెట‌ర్ సూచ‌న మేర‌కు త‌ను లెగ్ స్పిన్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఆ క్ర‌మంలో త్రిస్సూర్ చేరుకుని త‌న ఆట‌కు మ‌రింత మెరుగులు దిద్దుకున్నాడు. ఇక కేర‌ళ చాలెంజ్ ప్రీమియ‌ర్ లీగ్ లో సెయింట్ థామ‌స్ కాలేజీ త‌ర‌పున ఒక్క వెలుగు వెలిగాడు. ఆ టోర్నీలో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో బిగ్ స్టార్ గా మారాడు. దీంతో అంద‌రి దృష్టి అత‌నిపై ప‌డింది. ఈ నేప‌థ్యంలో ముంబై అత‌డిని కొనుగోలు చేసి, ఇటీవ‌ల జ‌రిగిన ఎస్ఏ 20 లీగ్ లో నెట్ బౌల‌ర్ గా సేవ‌లందించేందుకు సౌతాఫ్రికాకు పంపంది. అక్క‌డ ఎంఐ కేప్ టౌన్ త‌ర‌పున డ్రెస్సింగ్ రూంని పంచుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే స‌త్తా చాటిన పుతుర్ కి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

Continues below advertisement