IPL CSK vs MI Match Updates | చెన్నై: IPL 2025లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎల్ క్లాసికో ఉత్కంఠభరితంగా సాగింది. ఆదివారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ చేసిన స్టంపింగ్ హాట్ టాపిక్ అవుతుంది. ధోనీకి నిజంగానే 43 ఏళ్లు ఉంటాయా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కేవలం 0.12 సెకన్లలో ధోనీ వికెట్లను గిరాటేయడంతో షాకవడం ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వంతయింది.
భారత మాజీ కెప్టెన్ MS Dhoni కీపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ స్టంపింగ్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో ధోనీ చేసిన స్టంపింగ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ జస్ట్ ఒక్క అడుగు ముందుకేశాడు. అంతే రెప్పపాటులో ధోనీ స్టంపింగ్ చేశాడు. సూర్యకుమార్ క్రీజులోకి కాలు పెట్టేలోపే కేవలం 0.12 సెకన్లలోనే ధోనీ వికెట్లను గిరాటేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 36/3 తరువాత తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ 4వ వికెట్ కు 51 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ క్రీజును వదలడంతో రెప్పాపాటులో ధోనీ చేసిన స్టంపింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. యంగ్ ధోనీని మీరు చూస్తున్నారు, ఫాస్టెస్ట్ స్టంపింగ్ కు సూర్యకుమార్ వికెట్ సమర్పించుకున్నాడు.
ఇప్పుడు చెప్పండి. ధోనీకి వయసైపోయిందని, రిటైర్ అవుతారా అని అడుగుతారా అంటూ సీఎస్కే మాజీ కెప్టెన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. స్కిల్ ఉన్నంతకాలం, తనకు ఓపిక ఉన్నంత కాలం ధోనీ ఐపీఎల్ ఆడతాడని, ఈ సీజన్ చివరి సీజన్ కాబోదని అంతా అనుకుంటున్నారు. తాను వీల్ చైర్ లో ఉన్నా సీఎస్కే టీం తనను జట్టులోకి తీసుకెళ్తుందని సరదాగా చేసిన వ్యాఖ్యలు ఆదివారం మ్యాచ్ సందర్భంగా వైరల్ అయ్యాయి. మరో మూడు నెలలు అయితే ధోనీ వయసులో 44 ఏళ్లకు చేరుకుంటాడు. కానీ ఈ ఏజ్ లోనూ పాతికేళ్ల కుర్రాళ్లకు పోటీ ఇస్తూ పరుగులు పెడుతున్నాడు. యంగ్ కీపర్ల కంటే వేగంగా స్టంపింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి లోను చేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే ధోనీని వయసైపోయిందని, రిటైర్ అవుతారా అని అడిగే సాహసం చేయరు.
చెపాక్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI)పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబైని నిర్ణీత 20 ఓవర్లలో 155/9కి కట్టడి చేసింది. చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు.