అంతరక్షి పరిశోధనల్లో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... రాకెట్ ప్రయోగాలతో దూసుకెళ్తోంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 వంటి ప్రయోగానికి ప్రపంచదేశాలకు తన మార్క్ చూపించింది. సూర్యుడిని పరిశోధించేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఆదిత్య ఎల్-1 ప్రస్తుతం లాగ్రాంజ్ పాయింట్ వైపు దూసుకెళ్లడమే కాకుండా పరిశోధనలను కూడా ప్రారంభించింది. ఇప్పుడు... మరో రెండు అతి పెద్ద ప్రయోగాలకు సిద్ధమవుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.
ఈ ఏడాది చివరికల్లా అంటే డిసెంబర్ పూర్తయ్యేలోగా... రెండు పెద్ద రాకెట్ ప్రయోగాలు నిర్వహించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో పీఎస్‌ఎల్‌వీ (PSLV), జీఎస్‌ఎల్‌వీ-ఎంకే2 (GSLV-MK2) ప్రయోగాలకు సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేసేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌పోశాట్ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్‌రే మూలాలకు సంబంధించిన వివిధ డైనమిక్‌లను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి మిషన్. జీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇది వాతావరణ సేవలను అందించనుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎంకే2 ప్రయోగం చాలా ముఖ్యమైంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీతో కలిసి దీనిని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి వైబ్రేషన్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
GSLV-MK2 ప్రయోగం ఇస్రోకి కూడా చాలా ముఖ్యమైంది. ది 1.5 బిలియన్ల నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చూర్ రాడార్ (NISAR)కు ప్రయోగ వాహనాన్ని సిద్ధం చేస్తుంది, తక్కువ భూమి కక్ష్య (LEO) అబ్జర్వేటరీ. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ(JPL), ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేస్తోంది. మొదటిసారిగా... రెండు ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్న మిషన్ ఇది. నిసార్ వచ్చే ఏడాది జనవరిలో ప్రయోగిస్తారు. నిసార్ ప్రస్తుతం పూర్తి ఇంటిగ్రేటెడ్ పరీక్షలో ఉంది. ఇందులో యాంటినా, సౌండింగ్, పూర్తి -స్కేల్ పరీక్షలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా నిసార్ ప్రయోగానికి సిద్ధంగా ఉంటామని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. దీనిని ప్రయోగించి.. నిర్దేశించిన కక్ష్యలోకి విజయవంతంగా పంపిన తర్వాత నిసార్ యొక్క సైన్స్ ఆపరేషన్ ప్రారంభమవడానికి 90 రోజులు పడుతుందని ఆయన చెప్పారు.