Infosys Performance Bonus: 


ఉద్యోగులకు ఇన్‌ఫోసిస్ బోనస్..


ఇన్‌ఫోసిస్ ఉద్యోగులకు (Infosys Bonus) గుడ్‌న్యూస్ చెప్పింది. 80% వేరియబుల్ పే ఇస్తామని ప్రకటించింది. ఈ ఏడాది క్యాంపస్ హైరింగ్‌ని ఆపేస్తామని చెప్పిన కంపెనీ ఇప్పుడున్న ఉద్యోగులకు మాత్రం శుభవార్త చెప్పింది. అయితే...దీనికో క్రైటేరియా పెట్టింది.  Economic Times రిపోర్ట్ ప్రకారం..లెవెల్ 6 పొజిషన్‌, అంత కన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ ఇస్తామనని వెల్లడించింది. అంటే మేనేజర్ స్థాయి కంటే తక్కువ లెవెల్‌లో ఉన్న వాళ్లకే ఇది వర్తించనుంది. ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్‌కి మాత్రం వేరియబుల్ పే ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలోనూ పర్‌ఫామెన్స్ బోనస్ ఇచ్చింది. ఆ బోనస్‌తో పోల్చుకుంటే (Infosys Performance Bonus) ఈ సారి ఎక్కువే ఇస్తోంది కంపెనీ. అప్పుడు 60-70% మేర ఇచ్చిన కంపెనీ...ఈ సారి 80% వరకూ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అర్హులైన ఉద్యోగులకు మెయిల్ పంపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ గురించి ఈ మెయిల్‌లో ప్రస్తావించింది. కంపెనీ గ్రోత్‌ కోసం కష్టపడినందుకు గ్రాటిట్యూడ్‌గా ఈ బోనస్ అందిస్తున్నట్టు వెల్లడించింది. 



"క్వార్టర్ పర్‌ఫార్మెన్స్ బోనస్‌ని అర్హులైన ఉద్యోగులందరికీ అందిస్తాం. యూనిట్ డెలివరీ మేనేజర్‌లు ఈ వారంలోనే బోనస్‌ ఇస్తారు. మార్కెట్ షేర్‌ని ఇంకా పెంచేందుకు మీరు మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ లక్ష్యం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాం"


- ఇన్‌ఫోసిస్ యాజమాన్యం