Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్ సీఎంకి ప్రధాని మోదీ ఫోన్‌ కాల్, రెస్క్యూ ఆపరేషన్‌పై ఆరా

Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.

Continues below advertisement

Uttarkhand Tunnel Rescue: 

Continues below advertisement

ప్రధాని మోదీ ఫోన్ కాల్..

ఉత్తరాఖండ్ సొరంగం (Silkyara Tunnel Collapse) వద్ద రెస్క్యూ ఆఫరేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి కాల్ చేసి మాట్లాడారు. శిథిలాల కింద చిక్కుకున్న 41 కార్మికుల గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు వారం రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand Tunnel Rescue)కొనసాగుతోంది. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయం వెల్లడించింది. 

"ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన ఎక్విప్‌మెంట్‌, మిగతా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయి"

- ప్రధాని నరేంద్ర మోదీ

అంతర్జాతీయ నిపుణుడి సహకారం..

ఇప్పటికే భారీ డ్రిల్లింగ్ మెషీన్‌లు Silkyara Tunnel వద్దకు చేరుకున్నాయి. కార్మికులను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. లోపల ఉన్న కార్మికులకు ఆహారం, ఆక్సిజన్ అందించేందుకు 6 ఇంచుల పైప్‌లైన్‌ని ఏర్పాటు చేసింది. వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఇప్పటికే 8 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. Oil and Natural Gas Corporation (ONGC) బృందం ఇప్పటికే వర్టికల్ డ్రిల్లింగ్‌ (Vertical Drilling in Uttarakhand Tunnel) కూడా ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్‌ ఆర్నాల్డ్ డిక్స్ (Arnold Dix) ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌కి సహకారం అందిస్తున్నారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇతర నిపుణుల సలహాలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నట్టు చెప్పారు ఆర్నాల్డ్. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్‌ సానుకూలంగానే సాగుతోందని తెలిపారు. 

Continues below advertisement