Indian Coast Guard Saves 7 Indian Fishermen From Pakistan Security Agency: భారత మత్స్యకారులను పాక్ అధికారుల చెర నుంచి ఇండియన్ కోస్ట్ గార్డు (Indian Coast Guard) సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అరేబియా సముద్రంలో ఏడుగురు మత్స్యకారులను పాక్ అధికారులు పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌకలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల నుంచి అందిన సమాచారం మేరకు భారత నౌకాదళ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.


పీఎంఎస్ఏకు (PMSA) చెందిన PMS సుస్రత్  నౌకను వెంటాడి మరీ మత్స్యకారులను రక్షించారు. రెండు గంటల పాటు పాక్ ఓడను వెంటాడి ఈ ఆపరేషన్ ముగించింది. ఇందులో మన దేశానికి చెందిన బోట్ 'కాలభైరవ' డ్యామేజీ అయి మునిగిపోయినట్లు తెలిపింది. ఏడుగురు జాలర్ల ఆరోగ్యం నిలకడగా ఉందని కోస్ట్‌గార్డ్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై ఇండియన్ కోస్ట్ గార్డ్, స్టేట్ పోలీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఫిషరీస్ అధికారులతో కూడిన సంయుక్త దర్యాప్తును నిర్వహిస్తున్నాయి.










Also Read: Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !