Amazon India Will Save Close To 8 Crore In Rent After Moving Headquarters To New Location: అమెజాన్ అంటే ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీ. దాని యజమాని జెఫ్ బెజోస్ నెంబర్ వన్ కుబేరుడు. అలాంటి కంపెనీ తమకు కొంత రెంట్ మిగులుతుందని ఇప్పుడు ఉన్న ఆఫీసును ఖాళీ చేసి ఎక్కడికో శివారు ప్రాంతానికి వెళ్లిపోతుందని ఎవరూ అనుకోరు. కానీ వెళ్లిపోతోంది. ఎడాదికి ఎనిమది కోట్ల రూపాయల రెంట్ మిగులుతుందని ఇప్పుడు బెంగళూరు సిటీలో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేసి.. ఏపీ సరిహద్దులో బెంగళూరు ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న ఓ భవనంలోకి మార్చేస్తున్నారు. అమెజాన్ నిర్ణయం ఉద్యోగుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.             


Also Read :   నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్


ప్రస్తుతం బెంగళూరులోని అమెజాన్ ఆఫీసు బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీకి చెందిన ముఫ్పై అంతస్తుల భవనంలో ఉంది. అందులో పద్దెనిమిది అందస్తుల్లో ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ల స్పేస్‌లో అమెజాన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డబ్ల్యూటీసీ టవర్స్ గా పేరు పొందిన ఈ భవనంలో రెంట్ కాస్త ఎక్కువే. అయితే అది అమెజాన్ భరించలేనంత ఎక్కువ కాదు. కానీ కాస్ట్ కటింగ్ లో భాగంగా మరో ఆఫీసును చూసుకుని వెళ్లిపోవాలని డిసైడ్ చేసుకుంది. కంపెనీ ఉన్నతాధికారులు ఎయిర్ పోర్టు దగ్గర ఓ భవనం చూసి ఫైనల్ చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో చెల్లిస్తున్న రెంట్ కంటే.. చాలా తక్కువకు ఒప్పందం చేసుకున్నారు. ఏడాదికి దాదాపుగా రూ. ఎనిమిది కోట్లు సేవ్ అవుతాయని అమెజాన్ చెప్పుకొస్తోంది.                           


తరలింపు ప్రక్రియ వెంటనే జరగదు. కొంత సమయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి తరలింపును ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లోపే బ్రిగేడ్ కంపెనీ ఖాళీ అవుతున్న పద్దెనిమిది అంతస్తులకు కొత్త అద్దెదారును వెదుక్కోవాల్సి ఉంది. అయితే  ప్రస్తుతం ఉన్న ప్రైమ్ ప్లేస్ లో తమ ఆఫీసుల్ని పెట్టుకునేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.         


Also Read: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్ 


అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉద్యోగులకు బెంగళూరు క్యాంపస్ లో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు కంపెనీ లోకేషన్ మార్చడం వల్ల ఉద్యోగులకు ఎక్కువ సమస్యలు వస్తాయి. వారంతా ఎయిర్ పోర్టు వద్ద ఉన్న గ్రామాల్లోని ఇళ్లకు రీ లోకేట్ అవ్వాలి.లేకపోతే బెంగళూరు ట్రాఫిక్ లో..  రోజూ ఆఫీసుకు వెళ్లి రావడం అనేది అసాధ్యమైన విషయం. ఈ నిర్ణయం వల్ల అమెజాన్ కు డబ్బులు మిగుతాయి కానీ ఉద్యోగులుక మాత్రం చేతి చమురు వదులుతుదంన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.