Ram Charan at Kadapa Dargah : కడప దర్గాలో నేడు జరుగుతున్న నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్​కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇది హాట్​ టాపిక్​గా మారింది. ఎందుకంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. మరో మతాన్ని, వారి సంప్రదాయాల్ని గౌరవిస్తూ.. రామ్ చరణ్ ఈ వేడుకలకు హాజరు కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చెర్రీ ఈ ఈవెంట్​కు హాజరు కావడం వెనుక ఓ బలమైన కారణం ఉందట. 


ఇచ్చిన మాట కోసమే..


గత ఏడాది ఏ ఆర్ రెహమాన్ ఈ దర్గాకు వెళ్లారు. ఆ సమయంలో ఎలాగైనా దర్గాకు వస్తాను అని రెహమాన్​కు రామ్ చరణ్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం ప్రస్తుతం ఈ దర్గాలో జరుగుతున్న ఈవెంట్​కు రామ్​ చరణ్ వెళ్తున్నారు. కానీ ప్రస్తుతం చరణ్ స్వామి మాలలో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా అయ్యప్ప మాలను వేసుకుంటున్నారు. అయితే మాలలో ఉండి ఈ కార్యక్రమానికి హాజరవుతారా అనే ప్రశ్న అందరిలోనూ ఉండగా.. చరణ్ మాత్రం మరో మతాన్ని గౌరవిస్తూ.. వారి సంప్రదాయాల్నీ గౌరవిస్తూ.. ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 


కడప దర్గాకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ నటులు సైతం ఇక్కడికి వచ్చి మరీ ప్రార్థనలు చేసి వెళ్తుంటారు. స్టార్ హీరోలు ఎందరో ఈ దర్గాకు వచ్చారు. ప్రస్తుతం ఈ దర్గాలో 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్​ను చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గజల్ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఈవెంట్​కే రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రామ్ చరణ్ కోసం కడపలోని మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆయనను చూసేందుకు భారీగా ఈవెంట్ దగ్గరకు వెళ్తున్నారు. 



గేమ్ ఛేంజర్.. 


రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్​లలో చిత్రబృందం బిజీగా ఉంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్​గా చేస్తుంది. చెర్రీతో ఈమెకు ఇది రెండో సినిమా. ఎస్ థమన్ సినిమాకి సంగీతం అందించగా.. దిల్​ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. 



గేమ్ ఛేంజర్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అలాగే శంకర్ సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ వాల్యూ కూడా గ్లోబల్ స్థాయిలో పెరిగింది. బాలీవుడ్​ ప్రేక్షకులు సైతం ఈ సినిమా విడుదల గురించి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రబృందం అంతా సినిమా ప్రమోషన్​లలో బిజీగా ఉంది. అలాగే RC16 షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తుంది. 



Also Read : కంగువ నెగిటివ్ రివ్యూలపై జ్యోతిక సీరియస్.. "సూర్య వైఫ్​గా కాదు.. సినిమాను ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నాను"