భారత రక్షణ అభివృద్ధి సంస్థ (DRDO) నేడు (మార్చి 27) క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరీక్షను నేడు విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు DRDO అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘MRSAM - ఆర్మీ మిసైల్ సిస్టమ్‌ను ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ నుంచి ప్రయోగించాం. ఈ క్షిపణి వ్యవస్థ ఆర్మీలో భాగం. ఈ పరీక్షలో అధికారులు నిర్దేశించిన సుదూర లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా చేధించింది’’ అని డీఆర్‌డీవో అధికారులు ట్వీట్‌లో పేర్కొన్నారు.