Corona Cases: దేశంలో కొత్తగా 2,897 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,986 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 54 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19,494గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.61%గా ఉంది.
గత కొన్నిరోజులుగా మూడు వేలకు పైగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు 2 వేలకు పడిపోయాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది. 1.22 శాతం మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి. ఇందులో 4,25,66,935 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,157 మంది మరణించారు.
- మొత్తం కరోనా కేసులు: 4,31,10,586
- మొత్తం మరణాలు: 524157
- యాక్టివ్ కేసులు: 19494
- రికవరీల సంఖ్య: 42566935
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా తాజాగా 14,83,878 మందికి టీకాలు అందించింది ఆరోగ్య శాఖ. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190 కోట్ల 67 లక్షల 50 వేలు దాటింది.
Also Read: Bill Gates Corona Positive: బిల్‌గేట్స్‌కు కరోనా పాజిటివ్- వార్నింగ్ ఇచ్చిన కొన్ని రోజులకే!