Corona Cases: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. 42 మంది మృతి చెందారు. తాజాగా 14,553 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.50 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.30 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 4,36,22,651
- మొత్తం మరణాలు: 5,25,428
- యాక్టివ్ కేసులు: 1,28,690
- మొత్తం రికవరీలు: 4,29,68,533
వ్యాక్సినేషన్
దేశంలో తాజాగా 10,21,164 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,76,59,299కు చేరింది. మరో 4,32,777 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. భౌతిక దూరం పాటించాలని సూచించింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
Also Read: Telescope Origin : టెలిస్కోపుల తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?
Also Read: Passport: పాస్‌పోర్ట్‌లో పేజీలు చింపేశాడు, ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు