రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరిగింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేడు కేసులు నమోదయ్యాయి. రోజు వారి పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. ఆ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 


గత ఇరవై నాలుగు గంటల కేసులతో పోలిస్తే ఈ సంఖ్య ఇరవై ఏడు శాతం పెరిగినట్టు. ఇది నిన్నటి కంటే సుమారు యాభై వేలు కేసులు ఎక్కువగా రిజిస్టర్ అయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 


మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు పెరిగింది లేదు. 2021 ఏప్రిల్‌ 27న అంతకు ముందు రోజు కంటే 43,196 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా ఉండేది ఇప్పుడు మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా యాభై వేలు పెరిగాయి. ఇదే ఆందోళన కలిగించే అంశం. 







బుధవారం ఒక్కరోజు 203 మంది చనిపోయారు. అక్టోబర్‌ 27 తర్వాత చనిపోయిన వారి సంఖ్య పెరగడం కూడా ఇదే ఎక్కువ. 
ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. 









Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి